Chiranjeevi Vijayashanthi: చిరంజీవి క్యారెక్టర్‌లో 30 వెడ్స్ 21 హీరో.. విజయశాంతిగా ఆ హీరోయిన్.. జోడీకి నివాళిగా!-chaitanya rao about chiranjeevi vijayashanthi roles in sharathulu varthisthai at trailer launch bhumi shetty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Vijayashanthi: చిరంజీవి క్యారెక్టర్‌లో 30 వెడ్స్ 21 హీరో.. విజయశాంతిగా ఆ హీరోయిన్.. జోడీకి నివాళిగా!

Chiranjeevi Vijayashanthi: చిరంజీవి క్యారెక్టర్‌లో 30 వెడ్స్ 21 హీరో.. విజయశాంతిగా ఆ హీరోయిన్.. జోడీకి నివాళిగా!

Sanjiv Kumar HT Telugu

Chaitanya Rao About Chiranjeevi Vijayashanthi Roles: యూట్యూబ్ వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21తో బాగా పాపులర్ అయిన చైతన్య రావు హీరోగా నటిస్తున్న మరో సినిమా షరతులు వర్తిస్తాయి. ఇందులో చైతన్యరావు మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు తాజాగా షరతులు వర్తిస్తాయి ట్రైలర్ లాంచ్‌లో తెలిపాడు.

చిరంజీవి క్యారెక్టర్‌లో 30 వెడ్స్ 21 హీరో.. విజయశాంతిగా ఆ హీరోయిన్.. జోడీకి నివాళిగా!

Sharathulu Varthisthai Trailer Launch: 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు చైత‌న్య రావు. అనంతరం అనేక సినిమాల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ సినీ కెరీర్‌ను జోష్‌గా సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే చైతన్య రావు హీరోగా నటిస్తున్న మరో సినిమా షరతులు వర్తిస్తాయి. ఇందులో చైతన్య రావుకు జోడీగా భూమి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీకి కుమార‌స్వామి (అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు.

"షరతులు వర్తిస్తాయి" సినిమా ఈ నెల అంటే మార్చి 15వ తేదీన గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (మార్చి 3) షరతులు వర్తిస్తాయి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందుకు ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేశారు. ఈ షరతులు వర్తిస్తాయి ట్రైలర్ లాంచ్‌లో హీరో చైతన్య రావు ఆసక్తిర విషయాలు తెలిపాడు.

"ష‌ర‌తులు వ‌ర్తిసాయి ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే మిగతా వారికి షేర్ చేయండి. మీరొక మంచి సినిమా సజెస్ట్ చేశారని వారు భావిస్తారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది" అని షరతులు వర్తిస్తాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో చైతన్య రావు అన్నాడు.

"పూర్తిగా కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేసేందుకు మనసు ఉండాలి. అలాంటి మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ మాకు దొరికినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. కుమారస్వామి మంచి డైరెక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. "ష‌ర‌తులు వ‌ర్తిసాయి" నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ‌డియెన్స్ కు నన్ను దగ్గర చేస్తుందని ఆశిస్తున్నాను" అని చైతన్య రావు తెలిపాడు.

"విజయశాంతి క్యారెక్టర్‌లో భూమి శెట్టి బాగా నటించింది. తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. నేను చిరంజీవి క్యారెక్టర్‌లో, భూమి శెట్టి విజయశాంతి అనే క్యారెక్టర్‌లో నటించాం. 80లో క్రేజ్ ఉన్న ఆ పెయిర్‌కు ట్రిబ్యూట్‌గా మా క్యారెక్టర్స్‌కు ఆ పేర్లు పెట్టారు డైరెక్టర్ గారు. ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా ఈ నెల 15న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం" అని హీరో చైతన్య రావు కోరారు.

"నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల కెరీర్‌లో ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమాతో నాకొక మంచి అవకాశం లభించింది. ఈ సినిమా నటుడిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో శంకరన్న అనే క్యారెక్టర్‌లో నటించాను. ష‌ర‌తులు వ‌ర్తిసాయి సినిమా టీజర్ రిలీజైన తర్వాత నన్ను అందరూ శంకరన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము రిలేట్ చేసుకునే సినిమా అవుతుంది" అని నటుడు సంతోష్ యాదవ్ పేర్కొన్నారు.