BTS Jungkook: చరిత్ర సృష్టించిన బీటీఎస్ సింగర్ జంగ్‌కూక్.. యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్‌లో ఏడు పాటలు
BTS Jungkook: పాపులర్ కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్‌కు చెందిన సింగర్ జంగ్‌కూక్ చరిత్ర సృష్టించాడు. అతనికి చెందిన ఏడు పాటలు యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్ లో చోటు సంపాదించడం విశేషం.
BTS Jungkook: పాపులర్ పాప్ బ్యాండ్ బీటీఎస్ లోని సభ్యుడు, సింగర్ జంగ్‌కూక్ ప్రస్తుతం కొరియన్ మిలిటరీలో సేవలు అందిస్తున్నాడు. అయితే బయట మాత్రం అతని పాటలు ఇప్పటికీ ఓ ఊపు ఊపేస్తున్నాయి. తాజాగా అతని లేటెస్ట్ సాంగ్ నెవర్ లెట్ గో కూడా యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్ లో చోటు సంపాదించింది. జంగ్‌కూక్ కు చెందిన ఆరు పాటలు గతంలోనే ఇందులో చోటు సంపాదించడం విశేషం.
బీటీఎస్ జంగ్‌కూక్ సాంగ్స్
ఏడుగురు సభ్యులున్న బీటీఎస్ గ్రూపులో జంగ్‌కూక్ ఒకడు. ఈ గ్రూప్ అంతా కలిసి కొన్నాళ్లుగా ఎలాంటి సాంగ్స్ చేయలేదు. దీనికి కారణం సౌత్ కొరియాలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా మిలిటరీలో పని చేయాలన్న నిబంధనే. ప్రస్తుతం జంగ్‌కూక్ కూడా మిలిటరీలోనే ఉన్నాడు. బీటీఎస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా అతడు ఈ నెవల్ లెట్ గో పాటను రాసి, ప్రొడ్యూస్ చేశాడు.
ఈ పాటకు తాజాగా యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్ లో చోటు దక్కింది. యూఎస్ బిల్‌బోర్డ్స్ చార్ట్స్ లాగే దీనిని కూడా ప్రతిష్టత్మకంగా భావిస్తారు. గతంలోనే ఆరు పాటలు ఈ చార్ట్ లో ఉండగా.. ఇప్పుడు జంగ్‌కూక్ కు చెందిన ఏడో పాట కూడా చార్ట్స్ లోకి వెళ్లింది. కొరియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి సోలో సింగర్ గా అతడు చరిత్ర సృష్టించాడు.
జంగ్‌కూక్ ఏడు పాటలు ఇవే
మిలిటరీలో ఉంటూనే తాను ఈ పాట రాసానని, ఆర్మీ కోసం అసలు ఎలాంటి ప్లాన్ చేయకుండా చేసిన సాంగ్ అని జంగ్‌కూక్ చెప్పడం విశేషం. ఈ నెవర్ లెట్ గో సాంగ్ యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్స్ లో శుక్రవారానికి (జూన్ 14) 60వ స్థానంలో ఉంది. గతంలో జంగ్‌కూక్ కు చెందిన స్టే అలైవ్, స్టాండింగ్ నెక్ట్స్ టు యు, సెవెన్, లెఫ్ట్ అండ్ రైట్, టూమచ్ సాంగ్స్ యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్ లో చోటు దక్కించుకున్నాయి.
అంతేకాదు జంగ్‌కూక్ ఈ లేటెస్ట్ సాంగ్ అఫీషియల్ సింగిల్స్ డౌన్‌లోడ్స్ చార్ట్ లో నంబర్ 1గా, అఫీషియల్ సింగిల్స్ సేల్స్ చార్ట్ లో మూడో స్థానంలో ఉండటం విశేషం. యూకే అఫీషియల్ సింగిల్స్ చార్ట్ టాప్ 10లోనూ వరుసగా నాలుగుసార్లు ఎంటరైన ఘనత కూడా జంగ్‌కూక్ సొంతం. గతంలో సెవెన్ మూడో స్థానంలో, జాక్ హార్లో 5వ స్థానంలో, టూ మచ్ 10వ స్థానంలో, స్టాండింగ్ నెక్ట్స్ టు యు 6వ స్థానంలో ఉన్నాయి.