Malayalam: మలయాళం కంటే తెలుగులో మంచి సినిమాలు వస్తాయి: బ్రో నిర్మాత వివేక్-bro producer vivek kuchibhotla about manjummel boys and malayalam movie in pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam: మలయాళం కంటే తెలుగులో మంచి సినిమాలు వస్తాయి: బ్రో నిర్మాత వివేక్

Malayalam: మలయాళం కంటే తెలుగులో మంచి సినిమాలు వస్తాయి: బ్రో నిర్మాత వివేక్

Sanjiv Kumar HT Telugu
Apr 05, 2024 01:40 PM IST

Vivek Kuchibotla About Manjummel Boys: ఇటీవల మలయాళ సినీ పరిశ్రమలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో మలయాళం సినిమాలకంటే తెలుగులో మంచి చిత్రాలు వస్తాయి అన్నట్లుగా బ్రో నిర్మాత వివేక్ కూచిభొట్ల కామెంట్స్ చేశారు.

మలయాళం కంటే తెలుగులో మంచి సినిమాలు వస్తాయి: బ్రో నిర్మాత వివేక్
మలయాళం కంటే తెలుగులో మంచి సినిమాలు వస్తాయి: బ్రో నిర్మాత వివేక్

Vivek Kuchibotla About Manjummel Boys: మలయాళ యాక్టర్స్ సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్. ఈ సినిమా మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

yearly horoscope entry point

ఇప్పుడు ఈ సినిమాను పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో కూడా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రో నిర్మాతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్లతోపాటు ప్రొడ్యూసర్స్ శశిధర్ రెడ్డి, నవీన్ యెర్నేని, నిరంజన్ రెడ్డి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

"ట్రెమండస్ సక్సెస్‌ని అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ టీంకి అభినందనలు. తెలుగు రిలీజ్‌కి ఆల్ ది బెస్ట్. మైత్రీ శశి గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాని చెప్పాను. ఈ మధ్య మలయాళం చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ చూశారా అని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలని ఆదరిస్తే అలాంటి ధైర్యం మనకీ వస్తుంది. టీం అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్" అని నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.

 

"ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేయడానికి హెల్ప్ చేసిన షాన్, అనుప్ లాల్ కి ధన్యవాదాలు. మొదటి రోజు ఈ సినిమా చూసిన వెంటనే సినిమాని తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. రవి గారు, నవీన్ గారు ఈ సినిమాని ఇక్కడ గ్రాండ్గా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇది బ్లాక్ బస్టర్ అని ముందే అనుకున్నాం. ఈ సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు" అని నిర్మాత శశిధర్ రెడ్డి అన్నారు.

"ఇది పది మంది బాల్య స్నేహితులకు సంబధించిన కథ. ఇలాంటి స్నేహితులు జీవితంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. నా జీవితంలో రవి కూడా అలాంటి గొప్ప స్నేహితుడు. నిరాశలో ఉన్న కాలంలో ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. ఈ రకంగా ఈ సినిమా నా మనుసుకి చాలా దగ్గరరైయింది. ఏప్రిల్ 6న తెలుగులో సినిమా విడుదల అవుతోంది. ఏప్రిల్ 5న ప్రిమియర్స్ కూడా వేస్తున్నాం. మలయాళం సినిమా పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇదే తొలిసారి. ఇది బిగ్ ఎచీవ్మెంట్" అని శశిధర్ తెలిపారు.

"ఇది డబ్బింగ్ సినిమాల కాకుండా స్ట్రయిట్ సినిమాలనే దాదాపు 300 వందల స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం మాతో కలసి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద సినిమా. అందుకే ఎక్కడా రాజీపడకుండా మైత్రీ సొంత సినిమాలానే చేశాం. అందరికీ ధన్యవాదాలు" అని ప్రొడ్యూసర్ శశిధర్ చెప్పుకొచ్చారు.

Whats_app_banner