Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే-brahmamudi vs gundeninda gudigantalu star maa aadivaaram with star maa parivaaram promo released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి Vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే

Brahmamudi vs Gundeninda Gudigantalu: బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే

Hari Prasad S HT Telugu
Sep 26, 2024 09:45 PM IST

Brahmamudi vs Gundeninda Gudigantalu: స్టార్ మా టాప్ సీరియల్స్ బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు సీరియల్స్ నటీనటులు ఒకే స్టేజ్ పైకి వచ్చారు. తమదంటే తమదే నంబర్ వన్ అంటూ ఛాలెంజ్ విసురుకున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో అదిరిపోయింది.

బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే
బ్రహ్మముడి vs గుండెనిండా గుడిగంటలు.. అదిరిపోయిన ప్రోమో.. సండే పండగే

Brahmamudi vs Gundeninda Gudigantalu: స్టార్ మా ఛానెల్లో ప్రతి ఆదివారం వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ రాబోయే సండే (సెప్టెంబర్ 29) మరింత అదిరిపోనుంది. ఎందుకంటే ఈసారి ఈ ఛానెల్ టాప్ సీరియల్స్ అయిన బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు టీమ్స్ స్టేజ్ పై పోటీ పడనున్నాయి. తమదే నంబర్ వన్ సీరియల్ అంటూ ఈ రెండు సీరియల్స్ లోని హీరోయిన్లు పోట్లాడుకోవడం విశేషం.

బ్రహ్మముడి వర్సెస్ గుండెనిండా గుడిగంటలు

స్టార్ మా సీరియల్స్ లోనే కాదు మొత్తం తెలుగు టీవీ సీరియల్స్ లోనే చాలా రోజులుగా బ్రహ్మముడి టాప్ లో కొనసాగుతున్న విషయం తెలుసు కదా. అయితే ఈ సీరియల్ స్టార్ మాలోని మరికొన్ని సీరియల్స్ నుంచే గట్టి పోటీ ఉంటోంది. అందులో ఒకటి గుండెనిండా గుడిగంటలు. ఇప్పుడీ రెండు సీరియల్స్ నటీనటులు ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ కి వస్తున్నారు.

వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 29) ఉదయం 11 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానున్న ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చాలా ఎంటర్టైనింగా సాగింది. మొదట్లోనే బ్రహ్మముడి కావ్య, గుండెనిండా గుడిగంటలు మీనా స్టేజ్ మీదికి ఎంట్రీ ఇచ్చి తమదే నంబర్ వన్ సీరియల్ అంటే తమదే నంబర్ వన్ అంటూ పోట్లాడుకున్నారు.

ఆ తర్వాత ఈ రెండు సీరియల్స్ టీమ్స్ మొత్తంగా స్టేజ్ మీదికి వచ్చాయి. యాంకర్ శ్రీముఖి వాళ్లతో రకారకాల గేమ్స్ ఆడించడంతోపాటు కాంపిటీషన్స్ కూడా పెట్టింది. టీఆర్పీ రేటింగ్స్ లో ఎలా అయితే ఈ రెండు సీరియల్స్ పోటాపోటీగా తలపడుతున్నాయో.. ఈ స్టేజ్ పై కూడా వీళ్లు అలాగా పోటీ పడ్డారు. ప్రోమో చివర్లో ఓ మ్యాజిక్ షో కూడా పెట్టి మరింత ఆకర్షించారు.

ఆదివారం విత్ స్టార్ మా పరివారం

స్టార్ మా ఛానెల్లో వచ్చే టాప్ ప్రోగ్రామ్స్ లో ఒకటి ఆదివారం విత్ స్టార్ మా పరివారం. ప్రతి ఆదివారం ఆ ఛానెల్లో వచ్చే ఈ ప్రోగ్రామ్ కు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రతి వారం ఛానెల్ లో వచ్చే వివిధ సీరియల్స్, ప్రోగ్రామ్స్ కు చెందిన సెలబ్రిటీలు ఈ షోకి వస్తూ ఉంటారు.

వాళ్లతో గేమ్స్, కామెడీతో ప్రోగ్రామ్ అంతా సరదాగా సాగిపోతుంది. అయితే వచ్చే వారం మాత్రం స్టార్ మా ఛానెల్ టాప్ సీరియల్స్ అయిన బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు సీరియల్స్ నటీనటులు రానుండటంతో మరింత వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా ఛానెల్ సీరియల్స్ ను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో తాజా రేటింగ్స్ మరోసారి నిరూపించాయి. టాప్ 10లో ఏకంగా ఆరు ఈ ఛానెల్ కు చెందినవే కాగా.. టాప్ 5లో మొత్తం స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. ఎప్పటిలాగే అర్బన్, రూరల్ కలిపి తొలి స్థానంలో 12.64 రేటింగ్ తో బ్రహ్మముడి ఉంది. 37వ వారంతో పోలిస్తే ఈ సీరియల్ రేటింగ్స్ కాస్త పెరగడం విశేషం.

ఇక 11.57 రేటింగ్ తో కార్తీకదీపం 2 రెండో స్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో 10.68 రేటింగ్ తో గుండెనిండా గుడిగంటలు ఉండగా.. 10.12 రేటింగ్ తో ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో, 9.03 రేటింగ్ తో చిన్నీ ఐదో స్థానంలో ఉన్నాయి. స్టార్ మాలో వచ్చే మగువ ఓ మగువ (6.99), పలుకే బంగారమాయెనా (5.12), నువ్వు నేను ప్రేమ (5.03) కూడా మంచి రేటింగ్స్ సాధించాయి.