Brahmamudi February 28th Episode: ఒక్కటైన దుగ్గిరాల ఫ్యామిలీ - అనామిక రచ్చ -ధాన్యలక్ష్మికి షాకిచ్చిన కోడలు
Brahmamudi February 28th Episode: కళ్యాణ్ రాసిన కవితలను పిచ్చి రాతలుగా కొట్టిపడేస్తుంది అనామిక. ఇంట్లో అందరి ముందు గొడవ చేస్తుంది. తన భర్తను రాజ్, కావ్య కలిసి అసమర్థుడిని చేస్తున్నారంటూ ఫైర్ అవుతుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi February 28th Episode: భర్త కళ్యాణ్ ఆఫీస్‌లో కూడా కవితలు రాస్తుండటం అనామిక తట్టుకోలేకపోతుంది. ఆఫీస్‌లోనే భర్తను అందరి ముందు కడిగిపడేస్తుంది. దారుణంగా అవమానిస్తుంది. ఆమె మాటలను రాజ్ అడ్డుకుంటాడు. మీ భార్యభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకొమ్మని బుద్దిచెబుతాడు. కళ్యాణ్ సంగతి ఇంట్లోనే తేల్చుకుంటానని కోపంగా వెళ్లిపోతుంది అనామిక.
అనామిక మాటల దాడి...
కళ్యాణ్ ఇంటికి రావడంతోనే అతడిపై మాటల దాడి మొదలుపెడుతుంది అనామిక. ఈ రోజు ఏం జరిగిందో, రోజు ఏం జరుగుతుందో, ఇందులో సూత్రధారి, పాత్రధారి ఎవరో బయటపడాల్సిందేనని అందరి ముందు కోపంగా అరుస్తుంది. ఈ పదప్రయోగాలు నీకు ఎందుకు, నీ కష్టం ఏమిటో సామరస్యంగా చెప్పుకోమని అనామికకు క్లాస్ ఇస్తుంది అపర్ణ.
మీ అత్తలా నోరు పెద్దది చేసుకొని అరిస్తే కుదరదని అంటుంది. ఇంట్లో నాకు ఏ స్వాతంత్య్రం లేదు. కనీసం మోసం, అన్యాయం జరిగినప్పుడు నిలదీసే హక్కు కూడా లేదు.అలాంటిప్పుడు ఈ పంచాయితీ ఇంకేందుకు అని కోపంగా అనామిక అక్కడి నుంచి వెళ్లబోతుంది.
బాధ్యత మర్చిపోయిన కళ్యాణ్...
అనామికను ధాన్యలక్ష్మి ఆపుతుంది. ఇంటి కోడలికి ప్రశ్నించే అధికారం లేదని ఎవరు అన్నారు...అసలు నీ బాధ ఏమిటో చెప్పమని అనామికను అడుగుతుంది ధాన్యలక్ష్మి. నా బాధ మీ కొడుకేనని అనామిక బదులిస్తుంది. భర్తగా కళ్యాణ్ తన బాధ్యతను మర్చిపోయాడని చెబుతుంది.
నా భర్తను ప్రయోజకుడిగా ఉండమని అడిగాను. ఆఫీస్‌కు వెళ్లి ఎండీగా బాధ్యతలు తీసుకోమని అన్నాను. కానీ కళ్యాణ్ ఆఫీస్‌కు వెళ్లి కవిత్వం రాసుకుంటున్నాడని, కవి సమ్మేళనాలను జరుపుతున్నాడని ఫైర్ అవుతుంది.
కళ్యాణ్ పరువు తీసిన అనామిక...
కళ్యాణ్‌ను ఆఫీస్‌లో అనామిక కడిగివేసిన సంగతి అందరికి చెబుతాడు ప్రకాశం. ఆఫీస్‌లో నీ భర్త పరువు తీసేసి వచ్చావా...అక్కడ నువ్వు గొడవ చేస్తే కళ్యాణ్‌కు ఎలా ఉంటుందో ఊహించలేదా...మా అందరికి ఎంత అవమానకరంగా ఉంటుందో ఊహించలేదా అని అనామికకు క్లాస్ ఇస్తాడు సుభాష్. నా కోడలు అంటూ నెత్తిన పెట్టుకున్నారు. ఈ రోజు మీ కోడలు ఆఫీస్‌లో మీ కొడుకును కడిగేసిందటా. పర్వాలేదా...ఇంకా మీ కోడలు చేసింది కరెక్టే అని సమర్థిస్తారా అంటూ ధాన్యలక్ష్మిపై సెటైర్ వేస్తుంది స్వప్న.
ఒక్కటైనా దుగ్గిరాల ఫ్యామిలీ...
ఆఫీస్‌లో ఏదైనా జరిగితే చూసి చూడనట్లు వెనక్కి వచ్చేయాలి కానీ...అందరి ముందు కళ్యాణ్‌ను అవమానించడం కరెక్ట్ కాదని అనామికతో అంటుంది ధాన్యలక్ష్మి. అందరూ ఒక్కటై నన్ను వేరు చేస్తున్నారా అంటూ ధాన్యలక్ష్మి మాటలను అనామిక లెక్కచేయదు. నేను బాధపడుతున్నా...మోసపోతున్నా... అడికే హక్కు నాకు లేదా అని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌ను ప్రశ్నిస్తుంది.
అడగటానికి సమయం, సందర్భం, ప్రదేశం ఉంటాయి. పది మందిలో నా తమ్ముడిని అడిగే హక్కు నీకు లేదని అనామికతో అంటాడు రాజ్. నువ్వు వాడి భార్య అనే విషయం మర్చిపోయి అవమానించావు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాడి అభిరుచులు అర్థం చేసుకోవాలి. అది వదిలేసి కళ్యాణ్‌ను తప్పుపట్టడం వల్ల ఏ ప్రయోజనం ఉండదని రాజ్ అంటాడు.
ఒక బావ తన తమ్ముడి భార్యతో ఇలా మాట్లాడాల్సి రావడం దురదృష్టం. ఇంకోసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అని అనామికకు క్లాస్ ఇస్తాడు రాజ్.
కావ్యను తప్పుపట్టిన అనామిక...
కళ్యాణ్ ఏం తప్పు చేయలేదని, అతడు కవిత్వం రాస్తాడని తెలిసే నువ్వు పెళ్లిచేసుకున్నావని అనామికతో అంటుంది కావ్య. కవులను, కళాకారులను గౌరవించాలి కానీ ఇలా అవమానించకూడదని చెబుతుంది. కావ్యను మాటలను తప్పు పడుతుంది అనామిక.
నీ భర్తను మహారాజులా చూడటానికి నా భర్తను అసమర్థుడిని చేస్తున్నావని కావ్యపై కోప్పడుతుంది అనామిక. కళ్యాణ్‌కు ఏ పని అప్పగించకుండా కవిత్వం పిచ్చిని అడ్డం పెట్టుకొని మీరు అందలం ఎక్కాలని అనుకుంటున్నారని రాజ్, కావ్యలపై నోరు జారుతుంది. \
ఇదే నా నీ ఆదరణ...
అప్పటివరకు మౌనంగా ఉన్న కళ్యాణ్ అనామిక మాటలను సహించలేకపోతాడు. అరోపణలకు అర్థం ఉండాలి. నిందలు వేయడానికి ఆధారం ఉండాలని అనామికతో కోపంగా అంటాడు కళ్యాణ్. మా అన్న వదినల గురించి ఏం తెలుసునని విమర్శిస్తున్నావు. ఏ అర్హతతో అందరి ముందు అరుస్తున్నావని అనామికపై ఫైర్ అవుతాడు కళ్యాణ్. నేను నీకు బిజినెస్‌మెన్‌గా తెలుసా...కవిగా తెలుసా...కవిత్వాన్ని ఆదరిస్తానని అన్నావు.
ఇదేనా నీ ఆదరణ అని ప్రశ్నిస్తాడు. ఎంతసేపటికి నీ మాట నీదే కానీ.. నా రుచులు, అభిరుచులు తెలుసా అంటూ నిలదీస్తాడు. నాకు ఆఫీస్‌కు వెళ్లడం ఇష్టం లేదని తెలుసు. కానీ నీ బలవంతం మీదే వెళ్లాను. నాది బిజినెన్‌మెండ్ కాదు. అన్నయ్యలా క్లయింట్స్‌తో డీల్ చేయలేదు. అంత మాత్రానా నేను అసమర్థుడిని కాదని చెబుతాడు.
నా కోసమే బతుకుతాను..
నేను నీ కోసం, నీ ఆశలు, ఆశయాల కోసం ఏం చేయలేను. నా కోసం నా ఆత్మ సంతృప్తి కోసం క విగానే బతుకుతానని తేల్చిచెబుతాడు. అనామిక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ధాన్యలక్ష్మి కంగారు పడుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతుందో లేదంటే ఏదైనా చేసుకొని పైకి వెళ్లిపోతుందో రుద్రాణి గొడవ పెద్దది చేస్తుంది.
నీ ఆశయలు చంపేస్తే ఊరుకోను...
కోపంగా రూమ్‌లోకి వెళ్లిన అనామిక కళ్యాణ్ రాసిన కవిత్వం తీసుకొని బయట విసిరికొడుతుంది. ఈ పనికిమాలిన రాతలతో ఎప్పటికీ ఇలాగే బతుకుతానంటే చూస్తూ ఊరుకోనని అంటుంది. నీ అభిరుచుల కోసం నా ఆశలు, ఆశయాలను చంపేస్తావా అని కళ్యాణ్‌ను నిలదీస్తుంది. కవిత్వం అంటే అంత చులకన అయిపోయిందా. ఒక్క పదం రాయడం కోసం కవి ఎంత ప్రసవ వేదన పడతాడో నీకు తెలుసా అని అనామిక సర్ధిచెప్పబోతుంది కావ్య. కానీ కళ్యాణ్ వారిస్తాడు. అనామికకు ఎంత చెప్పిన అర్థం కాదని చెబుతాడు. అయినా కళ్యాణ్‌పై నోరు పారేసుకోవడం అనామిక ఆపదు.
ఇందిరాదేవి వార్నింగ్...
అప్పటివరకు సెలైంట్‌గా ఉన్న ఇందిరాదేవి అనామిక మాటల ప్రవాహాన్ని ఆపుతుంది. నువ్వు కళ్యాణ్‌లోని కళను చూసి చేసుకున్నావా...వాడి ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నావా అని నిలదీస్తుంది. నువ్వు ఆస్తిని చూసి చేసుకుంటే ఇంకో పది తరాల వరకు కూర్చొని తిన్న తరగని ఆస్తి కళ్యాణ్‌కు ఉందని అంటుంది. కవిత్వాన్ని కించపనిచే హక్కులేదని వార్నింగ్ ఇస్తుంది.
నేను నీ కోసం బతకను. నాకు నచ్చినట్లుగానే బతుకుతాను. ఇది నువ్వు తెలుసుకుంటేనే ప్రశాంతంగా ఉంటావని అనామికకు మరోసారి స్పష్టం చేస్తాడు కళ్యాణ్. నా కవిత్వం చదివే అర్హత కూడా నీకు లేదని చెబుతాడు. ప్రేమికుల రోజు నాడు అనామి కోసం కళ్యాణ్ తాను రాసిన కవిత్వాన్ని విసిరివేస్తాడు. ఆ పేపర్ కావ్య ముందు పడుతుంది.
కళ్యాణ్, అనామిక మధ్య గొడవలు సమసిపోయేలా చేసే బాధ్యతను తీసుకుంటుంది. అనామికకు సర్ధిచెప్పబోతుంది. కళ్యాణ్ మనసు సున్నితం, అతడిని బాధపెట్టవద్దని చెబుతుంది. కానీ కావ్య మాటలను అనామిక అపార్థం చేసుకుంటుంది.
రాజ్‌కు పంచ్...
పుట్టింటికి వెళతానని కావ్య అనగానే రాజ్ ఆనందంగా ఒప్పుకుంటాడు. కానీ కావ్య వెంట ఆమె బావ కూడా వెళుతున్నాడని తెలిసి రాజ్ కంగారు పడతాడు. వారి వెంట తాను వెళ్లాలని అనుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.