Boyapati Srinu: మరోసారి బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో మూవీ.. హీరో ఎవరంటే?-boyapati srinu allu aravind combo repeat again in geetha arts banner after sarrainodu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Boyapati Srinu Allu Aravind Combo Repeat Again In Geetha Arts Banner After Sarrainodu

Boyapati Srinu: మరోసారి బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో మూవీ.. హీరో ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 27, 2024 09:57 AM IST

Boyapati Srinu Allu Aravind Combo: సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరో ఎవరనేది ఆసక్తిగా మారింది.

మరోసారి బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో మూవీ.. హీరో ఎవరంటే?
మరోసారి బోయపాటి-అల్లు అరవింద్ కాంబోలో మూవీ.. హీరో ఎవరంటే?

Boyapati Srinu Upcoming Movie: కొన్ని కాంబినేష‌న్స్ గురించి విన‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం ఖాయం అనిపిస్తుంది. సేమ్ అలాంటి కాంబినేష‌నే.. క‌మర్షియ‌ల్ మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ల‌ది. 2016లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వచ్చిన సినిమా సరైనోడు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ మూవీ ఎలాంటి విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.

మరో భారీ ప్రాజెక్ట్

అల్లు అర్జున్‌-బోయ‌పాటి క‌ల‌యిక‌లో రూపొందిన స‌రైనోడు మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచి అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి సరైనోడు మూవీకి దాదాపుగా రూ. 127 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతటి సక్సెస్ కొట్టిందో. అయితే తాజాగా ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేషన్‌లో మ‌రో భారీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.

మాస్ చిత్రాలు-వాణిజ్య కథాంశాలు

భ‌ద్ర, తుల‌సి, సింహా, లెజండ్, స‌రైనోడు, అఖండ‌ వంటి క‌మర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను త‌న అద్బుత‌మైన మాస్‌మేకింగ్ స్కిల్స్‌తో సినిమాలు తెర‌కెక్కించి మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే బోయ‌పాటి శ్రీ‌ను, వైవిధ్య‌మైన వాణిజ్య క‌థాంశాల‌ను అత్యున్న‌త‌మైన నిర్మాణ విలువ‌ల‌తో నిర్మించి ఎన్నో అఖండ విజ‌యాలు సొంతం చేసుకున్న గొప్ప నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కాంబినేషన్ అన‌గానే సినీ ప్రేమికుల్లో ఎంతో ఆసక్తి కలుగుతుంది.

అదిరిపోయే అప్డేట్స్

త్వ‌ర‌లో బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది గీతా ఆర్ట్స్ సంస్థ. "మాసివ్ ఫోర్సెస్ ఒక్కటి అవుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాజికల్ మాస్ కాంబో మళ్లీ వచ్చేస్తోంది. త్వరలో అదిరిపోయే అప్డేట్స్ ఇస్తాం" అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ తమ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌లో గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ చెరోవైపు నిల్చుని ఉన్న ఫొటో ఉంది.

హీరోలందరూ బిజీగా

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్, ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో మరి ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో హీరో ఎవరా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, సూర్య, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పేర్లు చాలానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో #NBK109 మూవీతో బిజీగా ఉంటే.. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ అయ్యాక అట్లీ డైరెక్షన్‌లో బన్నీ సినిమా చేస్తాడని, ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా మూవీస్ లైన్‌లో ఉన్నాయని టాక్.

ఎవరివైపు అడుగు

ఇక సూర్య ఇటీవలే కంగువా మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఇక పాపులర్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో సూర్య చేయాల్సిన వాడివాసల్ మూవీ చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది. ఇవన్నీ క్లియర్ అయి బోయపాటి శ్రీనుతో సినిమా చేసే హీరో ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇంతమందిలో ఏ హీరో వైపు బోయపాటి శ్రీను మొగ్గు చూపుతాడో చూడాలి.

IPL_Entry_Point