Jio Cinema OTT: జియో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి-bloody daddy to mumbaikar list of upcoming movies and web series releasing on jio cinema ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bloody Daddy To Mumbaikar List Of Upcoming Movies And Web Series Releasing On Jio Cinema Ott

Jio Cinema OTT: జియో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

బ్ల‌డీడాడీ  మూవీ
బ్ల‌డీడాడీ మూవీ

Jio Cinema OTT: స్టార్స్ న‌టించిన సినిమాలు, సిరీస్‌లు జియో ఓటీటీ ద్వారా మే, జూన్ నెల‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే...

Jio Cinema OTT: అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీప‌డేందుకు జియో సినిమా ఓటీటీ సిద్ధ‌మ‌వుతోంది. టాలీవుడ్‌, బాలీవుడ్ హీరోహీరోయిన్లు న‌టించిన ప‌లు సినిమాలు, సిరీస్‌లో త్వ‌ర‌లో జియో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఆ సినిమాలు సిరీస్‌లు ఏవంటే...

ట్రెండింగ్ వార్తలు

ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, విశ్వ‌క్‌సేన్‌, నివేథా పేతురాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన భూ మూవీ మే 27న జియో సినిమాలో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి ఏ.ఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అలాగే షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ బ్ల‌డీడాడీ జూన్ 9న జియో ఓటీటీలో రిలీజ్ కానుంది.

ఈ బాలీవుడ్ మూవీకి అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతున్న‌ది. అలాగే విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ మూవీ ముంబైక‌ర్ కూడా జియో ఓటీటీలోనే రీలిజ్ కానుంది. జూన్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మా న‌గ‌రం సినిమాకు రీమేక్‌గా ముంబైక‌ర్ మూవీ రూపొందుతోంది.ఈ సినిమాకు సంతోష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

విక్రాంత్ మ‌స్సే కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నాడు. అలాగే సుస్మితాసేన్ తాలి వెబ్‌సిరీస్‌తో పాటు అసుర్ సీజ‌న్ 2 కూడా జూన్ నెల‌లోనే జియో ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు మ‌రికొన్ని సినిమాలు, సిరీస్‌లు జియో ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి.