Biggest Flop Movie: శ్రీదేవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్లర్ ఫ్లాప్.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న డైరెక్టర్-biggest flop movie sridevi anil kapoor jackie shroff movie biggest box office failure of bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Flop Movie: శ్రీదేవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్లర్ ఫ్లాప్.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న డైరెక్టర్

Biggest Flop Movie: శ్రీదేవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్లర్ ఫ్లాప్.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న డైరెక్టర్

Hari Prasad S HT Telugu
Jun 16, 2024 02:07 PM IST

Biggest Flop Movie: శ్రీదేవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్టర్ ఫ్లాపయిన విషయం తెలుసా? ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో డైరెక్టర్ ఆత్మహత్య చేసుకుందాని అనుకున్నాడట.

శ్రీదేవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్లర్ ఫ్లాప్.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న డైరెక్టర్
శ్రీదేవి నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ అట్లర్ ఫ్లాప్.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న డైరెక్టర్

Biggest Flop Movie: భారీ బడ్జెట్.. పెద్ద పెద్ద స్టార్లు ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు.. కోట్లకు కోట్లు వచ్చి పడతాయి అనుకుంటే పొరపాటే. దానికి ఉదాహరణే మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ. ఈ సినిమాలో శ్రీదేవి, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి పెద్ద నటీనటులు ఉన్నారు. ఆ సినిమా రూపొందే సమయానికి బాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ మూవీ ఇది. కానీ అట్టర్ ఫ్లాపయింది.

శ్రీదేవి మూవీ.. అట్టర్ ఫ్లాప్

బాలీవుడ్ లో శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ ఇండియా మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు. 1987లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావించిన ఆ మూవీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్.. మరోసారి తన తమ్ముడు అనిల్ కపూర్, శ్రీదేవి కాంబినేషన్ లోనే సినిమా తీయాలని భావించాడు.

జాకీ ష్రాఫ్ ను కూడా చేర్చారు. మిస్టర్ ఇండియా డైరెక్ట్ చేసిన శేఖర్ కపూరే ఈ మూవీని కూడా తీయాలనుకున్నాడు. 1988లోనే రూప్ కీ రాణి చోరోంకా రాజా మూవీ అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మధ్యలోనే డైరెక్టర్ శేఖర్ కపూర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత నటుడు, మిస్టర్ ఇండియాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సతీష్ కౌశిక్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.

అత్యధిక బడ్జెట్.. స్టార్లు ఉన్నా..

ఈ సినిమాను రూ.2 నుంచి రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ఆలస్యం కావడంతో అది కాస్తా రూ.10 కోట్లకు చేరింది. 1993లో ఈ మూవీ రిలీజయ్యే సమయానికి బాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ సినిమాగా నిలిచింది. అయితే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా కూడా అపవాదు మూటగట్టుకుంది. స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో అనిల్ కపూర్, శ్రీదేవి, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు ఉన్నా కూడా ప్రేక్షకులు మూవీని ఆదరించలేదు.

దీంతో బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతకు భారీ నష్టాలు తప్పలేదు. అంతేకాదు తొలిసారి మెగాఫోన్ పట్టిన సతీష్ కౌశిక్ కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. ఆత్మహత్య కూడా చేసుకుందామని భావించాడు. ఈ విషయం గతేడాదిగానీ తెలియలేదు. సతీష్ గతేడాది మార్చిలో కన్నుమూశాడు.

ఆత్మహత్య చేసుకుందామనుకొని..

తర్వాత అతనికి నివాళిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలీవుడ్ నటి షబానా అజ్మి మాట్లాడింది. ఈ సినిమా తర్వాత అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని ఆమె ద్వారానే ప్రపంచానికి తెలిసింది. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను మూటగట్టుకున్న సతీష్ కౌశిక్.. ఆ ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా ఎలా సరదాగా విరమించుకున్నాడో షబానా తెలిపింది.

"అతడు ఫస్ట్ ఫ్లోర్ లో నిల్చొన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కిందికి చూశాడు. అక్కడ ఓ పార్టీ జరుగుతోంది. అక్కడ ఆలూ, వంకాయలను ఫ్రై చేయడం చూశాడు. ఈ ఆలుగడ్డలు, వంకాయల మధ్య దూకి ఆత్మహత్య చేసుకుంటే అస్సలు బాగోదు అని అతడు అనుకున్నాడు" అని షబానా నవ్వుతూ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంది.

Whats_app_banner