Bigg Boss Telugu Winners List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు విజేతల జాబితా, వారి పూర్తి వివరాలు
Hindustan Telugu News

బిగ్ బాస్ తెలుగు విజేతల జాబితా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1

బిగ్ బాస్ తెలుగు 2017లో మొదలైంది. తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.. శివ బాలాజీ విజేతగా నిలిచాడు. అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న నటుడు అతడు. శివ బాలాజీ తెలుగు తమిళ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. ఆర్య‌, చంద‌మామ‌, సంక్రాంతి సినిమాలు అత‌డికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2

బిగ్ బాస్ తెలుగు 2 అంటే రెండో సీజన్ 2018లో జరిగింది. ఈ సీజన్‌కు నాని హోస్ట్‌గా ఉన్నాడు. ఇందులో కౌశల్ మందా విజేతగా నిలిచాడు. కౌశ‌ల్ మందా మోడ‌ల్, టీవీ న‌టుడు. చ‌క్ర‌వాకం, దేవ‌త‌తో పాటు తెలుగులో ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కొన్ని సినిమాలు చేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3

2019 లో జరిగిన బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున ఈ రియాల్టీ షోని హోస్ట్ చేస్తున్నాడు. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. రాహుల్ సింప్లిగంజ్ సింగ‌ర్‌. ఆర్ఆర్ఆర్‌, అల వైకుంఠ‌పుర‌ములో తో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో పాట‌లు పాడాడు. అతడు పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4

2020లో కొవిడ్ సమయంలోనూ బిగ్ బాస్ ఆగలేదు. ఆ ఏడాది నాలుగో సీజన్ జరిగింది. అందులో అభిజీత్ విజేతగా నిలిచాడు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్‌. సినిమాల‌తో పాటు కొన్ని తెలుగు వెబ్‌సిరీస్‌ల‌లో కీల‌క పాత్ర‌లు చేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5

బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ 2021లో జరిగింది. ఇందులో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. టీవీ యాంక‌ర్‌గా వీజే స‌న్నీ కెరీర్ ఆరంభ‌మైంది. క‌ళ్యాణ వైభోగ‌మే అనే సీరియ‌ల్‌లో లీడ్ రోల్ చేశాడు. అన్‌స్టాప‌బుల్‌, సౌండ్ పార్టీ సినిమాల్లో హీరోగా న‌టించాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 2022లో వచ్చింది. ఈ సీజన్ లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. రేవంత్ ఓ ప్లే బ్యాక్ సింగర్. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 9 విన్న‌ర్‌గా నిలిచాడు. గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, బ్రోతో పాటు ప‌లు సినిమాల్లో సూప‌ర్ హిట్ సాంగ్స్ ఆల‌పించాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7

గతేడాది జరిగిన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్. సామాన్యుడిగా బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి విన్న‌ర్‌గా నిలిచాడు. ట్రోఫీ గెలిచిన తర్వాత అతడు చేసిన రచ్చ, తర్వాత పోలీసు కేసులతో గతేడాది బిగ్ బాస్ షో ప్రముఖంగా వార్తల్లో నిలిచింది.

బిగ్‌బాస్ గత సీజన్ల విజేతలు

  • పేరు
  • ప్రొఫెషన్
  • సీజన్, సంవత్సరం
  • హోస్ట్
  • పల్లవి ప్రశాంత్

    పల్లవి ప్రశాంత్
  • పల్లవి ప్రశాంత్ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్స‌ర్‌. సామాన్యుడిగా బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి విన్న‌ర్‌గా నిలిచాడు.

  • Season 7, 2023
  • నాగార్జున
  • మరిన్ని చదవండి
  • రేవంత్

    రేవంత్
  • రేవంత్ ప్లే బ్యాక్ సింగర్. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 9 విన్న‌ర్‌గా నిలిచాడు. గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, బ్రోతో పాటు ప‌లు సినిమాల్లో సూప‌ర్ హిట్ సాంగ్స్ ఆల‌పించాడు.

  • Season 6, 2022
  • నాగార్జున
  • మరిన్ని చదవండి
  • వీజే సన్నీ

    వీజే సన్నీ
  • టీవీ యాంక‌ర్‌గా వీజే స‌న్నీ కెరీర్ ఆరంభ‌మైంది. క‌ళ్యాణ వైభోగ‌మే అనే సీరియ‌ల్‌లో లీడ్ రోల్ చేశాడు. అన్‌స్టాప‌బుల్‌, సౌండ్ పార్టీ సినిమాల్లో హీరోగా న‌టించాడు.

  • Season 5, 2021
  • నాగార్జున
  • మరిన్ని చదవండి
  • అభిజీత్

    అభిజీత్
  • శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌తో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్‌. సినిమాల‌తో పాటు కొన్ని తెలుగు వెబ్‌సిరీస్‌ల‌లో కీల‌క పాత్ర‌లు చేశాడు.

  • Season 4, 2020
  • నాగాార్జున
  • మరిన్ని చదవండి
  • రాహుల్ సిప్లిగంజ్

    రాహుల్ సిప్లిగంజ్
  • రాహుల్ సింప్లిగంజ్ సింగ‌ర్‌. ఆర్ఆర్ఆర్‌, అలా వైకుంఠ‌పుర‌ములో తో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో పాట‌లు పాడాడు.

  • Season 3, 2019
  • నాగార్జున
  • మరిన్ని చదవండి
  • కౌశల్ మందా

    కౌశల్ మందా
  • కౌశ‌ల్ మందా మోడ‌ల్, టీవీ న‌టుడు. చ‌క్ర‌వాకం, దేవ‌త‌తో పాటు తెలుగులో ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కొన్ని సినిమాలు చేశాడు.

  • Season 2, 2018
  • నాని
  • మరిన్ని చదవండి
  • శివ బాలాజీ

    శివ బాలాజీ
  • శివ బాలాజీ తెలుగు సినీ నటుడు. తెలుగు తమిళ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టించాడు. ఆర్య‌, చంద‌మామ‌, సంక్రాంతి సినిమాలు అత‌డికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

  • Season 1, 2017
  • జూనియర్ ఎన్టీఆర్
  • మరిన్ని చదవండి
అన్నీ చూడండి

బిగ్‌బాస్‌ నుంచి మరిన్ని