Bigg Boss Sivaji: ప్రొడ్యూస‌ర్‌గా మారిన బిగ్‌బాస్ శివాజీ - 19 ఏళ్ల త‌ర్వాత ల‌య‌తో సినిమా!-bigg boss sivaji turned as producer with telugu crime comedy movie laya 90s middle class biopic web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Sivaji: ప్రొడ్యూస‌ర్‌గా మారిన బిగ్‌బాస్ శివాజీ - 19 ఏళ్ల త‌ర్వాత ల‌య‌తో సినిమా!

Bigg Boss Sivaji: ప్రొడ్యూస‌ర్‌గా మారిన బిగ్‌బాస్ శివాజీ - 19 ఏళ్ల త‌ర్వాత ల‌య‌తో సినిమా!

Nelki Naresh Kumar HT Telugu
Aug 19, 2024 03:58 PM IST

Bigg Boss Sivaji: దాదాపు 19 ఏళ్ల త‌ర్వాత శివాజీ, ల‌య జోడీ మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్నారు. వీరిద్ద‌రు హీరోహీరోయిన్లుగా తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతోంది. ఈ సినిమాకు శివాజీ స్వ‌యంగా నిర్మించ‌బోతున్నాడు.

బిగ్ బాస్ శివాజీ
బిగ్ బాస్ శివాజీ

Bigg Boss Sivaji: తెలుగులో మిస్స‌మ్మ‌, టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా, అదిరింద‌య్యా చంద్రం సినిమాల్లో జంట‌గా న‌టించారు శివాజీ, ల‌య‌. కామెడీ ఎమోష‌న‌ల్ క‌థాంశాల‌తో రూపొందిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల్ని సాధించాయి. దాదాపు 19 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి శివాజీ, ల‌య జోడీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్న‌ది.

వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతోంది. హీరోగా న‌టిస్తూనే ఈ సినిమాను శివాజీ స్వ‌యంగా నిర్మిస్తోన్నాడు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో సుధీర్ శ్రీరామ్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

దిల్‌రాజు...బోయ‌పాటి శ్రీను...

శివాజీ, ల‌య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఫ‌స్ట్ షాట్‌కు క్లాప్‌ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. డైరెక్ట‌ర్‌ బోయపాటి శ్రీను ఫ‌స్ట్ షాట్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ సినిమాలో శివాజీ, ల‌య పాత్ర‌లు కొత్త‌గా ఉంటాయ‌ని అంటున్నారు. నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌లో శివాజీ కొడుకుగా న‌టించిన రోహ‌న్ రాయ్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. శివాజీతో అత‌డి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

ఆగ‌స్ట్ 20 నుంచి షూటింగ్‌...

ఆగ‌స్ట్ 20 నుండి ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కి సంబందించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని తొంద‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7

సినిమాల‌కు చాలా కాలంగా దూరంగా ఉన్న శివాజీ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 తో రీఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ షోలో ఫైన‌ల్ చేరిన శివాజీ ఐదో ర‌న్న‌ర‌ప్‌గా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌తో తిరిగి క్రేజ్ సంపాదించుకున్న శివాజీ నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌లో న‌టించాడు. ఈ వెబ్‌సిరీస్‌లో మ‌ధ్య త‌ర‌గ‌తి టీచ‌ర్ పాత్ర‌లో స‌హ‌జ‌ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 1990 కాలం నాటి అనుభ‌వాలు, అనుభూతుల‌ను హృద్యంగా ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కిన ఈ సిరీస్ పెద్ద విజ‌యాన్ని సాధించింది.

నైంటీస్ మిడిల్ క్లాస్ తో బిజీ..

నైంటీస్ మిడిల్ క్లాస్ త‌ర్వాత శివాజీ ఆర్టిస్ట్‌గా శివాజీ మ‌ళ్లీ బిజీగా మారాడు. కూర్మ‌నాయ‌కితోపాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు చేస్తోన్నాడు. వెబ్‌సిరీస్‌ల‌లో అత‌డు న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం.

మాస్ట‌ర్‌తో ఎంట్రీ...

మాస్ట‌ర్ సినిమాతో యాక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ...ప్రేమంటే ఇదేరా, ప్రియ‌మైన నీకు, యువ‌రాజుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్‌గా న‌టించాడు. హీరోగా మంత్ర‌, మిస్స‌మ్మ‌, అమ్మాయి బాగుందితో ప‌లు సినిమాల్లో విజ‌యాల్ని అందుకున్నాడు. జ‌యంతోపాటు దిల్ సినిమాల్లో నితిన్‌కు డ‌బ్బింగ్ చెప్పాడు. తెలుగులో విజ‌య‌వంత‌మైన పిజ్జా సినిమాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పింది శివాజీనే కావ‌డం గ‌మ‌నార్హం.