బిగ్ బాస్ లైవ్ వీడియోపై సైబర్ క్రైమ్ విచారణ కోరిన జియో సినిమా
అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ లైవ్ సెక్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై జియో సినిమా ఇటీవల ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ విచారణను ఆ ఓటీటీ కోరింది.
బిగ్ బాస్ ఓటీటీ 3లో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ ల ఇంటిమేట్ క్లిప్పింగ్ పై జియో సినిమా ఘాటుగా స్పందించింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఇది ఫేక్ వీడియో అని, దీనికి బాధ్యులైన వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మానిప్యులేటెడ్ వీడియోకు కారణమైన వ్యక్తిని గుర్తించడానికి, దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ జియో సినిమా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది.
వీడియోపై జియో సినిమా ఫిర్యాదు
బిగ్ బాస్ ఓటీటీ 3లో ఓ లైవ్ సెక్స్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలుసు కదా. ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఉన్న కపుల్ అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ సెక్స్ లో పాల్గొన్నారంటూ ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో దీనిపై జియో సినిమా స్పందించింది. దీనికి బాధ్యలు ఎవరో తెలుసుకోవడానికి తాము సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు జియో సినిమా తెలిపింది. ఈ ఫిర్యాదులో జియో సినిమా ఇంకేం చెప్పిదంటే.. "ఈ ఘటన చూస్తుంటే కేవలం ఇది ప్రారంభంగానే కనిపిస్తోంది. దురుద్దేశంతో చేసిన మరిన్ని ఫేక్ వీడియోలు కూడా ఉండొచ్చు. అవి ఇప్పటికీ మా దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. ఫిర్యాదుదారు కంపెనీ, సదరు ప్రోగ్రామ్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఎవరో కావాలనే ఇలాంటి వీడియోలు రూపొందించినట్లు అనిపిస్తోంది" అని చెప్పింది.
అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రస్తుతం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ అనే జంట కూడా పార్టిసిపేట్ చేస్తోంది. ఈ ఇద్దరూ రాత్రి 12.30 గంటల సమయంలో సెక్స్ చేసుకున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ శివసేన పార్టీ డిమాండ్ చేసింది. బిగ్ బాస్ ఓటీటీ 3 అశ్లీలతను ప్రోత్సహిస్తోందని శివసేన కార్యదర్శి, అధికార ప్రతినిధి ఎమ్మెల్యే డాక్టర్ మనీషా కయాండే మండిపడ్డారు. అర్మాన్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె విమర్శించారు. రియాలిటీ షోలలో ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ ల కోసం చట్టం తీసుకురావాలని సమాచార, ప్రసార శాఖ మంత్రిని కోరనున్నట్లు మనీషా పేర్కొన్నారు.