బిగ్ బాస్ లైవ్ బోల్డ్ వీడియోపై స్పందించిన జియో సినిమా ఓటీటీ.. ఆ వీడియోను అలా..-bigg boss live bold video jio cinema reacted to the viral video says it is doctored committed to ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బిగ్ బాస్ లైవ్ బోల్డ్ వీడియోపై స్పందించిన జియో సినిమా ఓటీటీ.. ఆ వీడియోను అలా..

బిగ్ బాస్ లైవ్ బోల్డ్ వీడియోపై స్పందించిన జియో సినిమా ఓటీటీ.. ఆ వీడియోను అలా..

Hari Prasad S HT Telugu
Aug 20, 2024 02:34 PM IST

బిగ్ బాస్ లైవ్ సెక్స్ వీడియో వైరల్ గా మారి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో దీనిపై జియో సినిమా ఓటీటీ స్పందించింది. ఆ వీడియోను ఎవరో మార్చారంటూ వివరణ ఇచ్చింది.

బిగ్ బాస్ లైవ్ సెక్స్ వీడియోపై స్పందించిన జియో సినిమా ఓటీటీ.. ఆ వీడియోను అలా..
బిగ్ బాస్ లైవ్ సెక్స్ వీడియోపై స్పందించిన జియో సినిమా ఓటీటీ.. ఆ వీడియోను అలా..

బిగ్ బాస్ ఓటీటీ 3 నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లైవ్ సెక్స్ వీడియోపై ఆ షోని స్ట్రీమింగ్ చేస్తున్న జియో సినిమా స్పందించింది. కావాలనే ఎవరో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ వీడియోను మార్చారని ఆ ఓటీటీ చెప్పడం గమనార్హం. ఈ షోని నిషేధించాలంటూ శివ సేన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జియో సినిమా వివరణ ఇచ్చింది.

ఆ వీడియోపై జియో సినిమా ఏమన్నదంటే?

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3లోని ఓ ఎపిసోడ్లో వచ్చినట్లుగా చెబుతూ ఓ సెక్స్ వీడియో కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అందులో దంపతులైన అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ సెక్స్ చేసుకుంటున్నట్లుగా చూపించడంతో ఆ వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ షో అన్ని హద్దులూ దాటేసిందని, నిషేధం విధించాల్సిందే అని శివసేన పార్టీ డిమాండ్ చేసింది.

దీంతో జియో సినిమా దిగి వచ్చింది. ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. "కఠిన ప్రోగ్రామింగ్ ప్రమాణాలు, మార్గదర్శకాలకు జియో సినిమా కట్టుబడి ఉంది. మా ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమ్ అయ్యే కంటెంట్ నాణ్యత, సముచితంగా ఉండేలా చూస్తాం. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న బిగ్ బాస్ ఓటీటీలో అలాంటి కంటెంట్ ఎక్కడా లేదు. అశ్లీలతను జోడించిన ఆ వీడియో క్లిప్ ను ఎవరో మార్చారు.

యూజర్లు మాపై ఉంచిన విశ్వాసానికి మేము కట్టుబడి ఉంటాం. ఇలాంటి ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం" అని జియో సినిమా తెలిపింది. ఈ క్లిప్ ఎక్కడి నుంచి వచ్చిందో వెలికి తీసే పనిలో తాము ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తామని కూడా చెప్పింది.

అసలు ఆ వీడియోలో ఏమున్నదంటే?

బిగ్ బాస్ ఓటీటీ 3లో మొదటి నుంచి ఎంతో వివాదాస్పదంగా మారిన కంటెస్టెంట్ అర్మాన్ మాలిక్. తాను ఇద్దరిని పెళ్లి చేసుకున్నానని ఓపెన్ గా చెప్పాడతడు. ఆ ఇద్దరు భార్యలతో కలిసే ఈ షోలో పాల్గొన్నాడు. అందులో ఒకరు పాయల్ మాలిక్ ఇప్పటికే ఇంటికెళ్లిపోయింది. ఇప్పుడు అర్మాన్, కృతికా మాలిక్ ఇంకా హౌజ్ లో ఉన్నారు. ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ ఇద్దరూ రాత్రి 12.30 గంటల సమయంలో సెక్స్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో అర్మాన్, కృతికా మొదట ఆ మూడ్ లోకి వెళ్లి తర్వాత దుప్పట్లో దూరిన వీడియో అది. అది కాస్తా వైరల్ కావడంతో ఈ షోని నిషేధించాలంటూ శివ సేన పార్టీ డిమాండ్ చేస్తోంది.

Whats_app_banner