Bigg Boss 7 Telugu: “హౌస్‍లో గ్రూప్స్ ఉన్నాయ్”: ఎలిమినేషన్ తర్వాత పేర్లతో సహా చెప్పిన అశ్వినీ.. రతిక కూడా ఔట్!-bigg boss house divided into groups says ashwini shree after elimination and rathika also set to out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: “హౌస్‍లో గ్రూప్స్ ఉన్నాయ్”: ఎలిమినేషన్ తర్వాత పేర్లతో సహా చెప్పిన అశ్వినీ.. రతిక కూడా ఔట్!

Bigg Boss 7 Telugu: “హౌస్‍లో గ్రూప్స్ ఉన్నాయ్”: ఎలిమినేషన్ తర్వాత పేర్లతో సహా చెప్పిన అశ్వినీ.. రతిక కూడా ఔట్!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 26, 2023 02:06 PM IST

Bigg Boss 7 Telugu Day 84 Promo: బిగ్‍బాస్ నుంచి అశ్వినీ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక స్టేజ్‍పై మాట్లాడారు. కాగా, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో మరో కంటెస్టెంట్ కూడా హౌస్ నుంచి ఔట్ కానున్నారు. ఆ వివరాలివే..

నాగార్జున, అశ్వినీ శ్రీ
నాగార్జున, అశ్వినీ శ్రీ

Bigg Boss 7 Telugu Day 84 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ నుంచి అశ్వినీ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. 12వ వారంలో ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో.. శనివారమే అశ్వినీ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వచ్చాక స్టేజీపై హోస్ట్ నాగార్జున.. అశ్వినీతో మాట్లాడారు. హౌస్‍లో హిట్ ఎవరో ఫ్లాఫ్ ఎవరో చెప్పాలని అశ్వినీని అడిగారు. ఇది నేటి ఎపిసోడ్ (నవంబర్ 26, ఆదివారం) ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక స్టేజీపైకి వచ్చారు అశ్వినీ శ్రీ. నవ్వుతూనే కనిపించారు. హౌస్‍లోని కంటెస్టెంట్లకు హాయ్ చెప్పారు. “నువ్వు వెళ్లిపోయే ముందు హౌస్‍లో హిట్ ఎవరో ఫ్లాఫ్ ఎవరో చెప్పేసి వెళ్లాలి” అని అశ్వినీతో నాగ్ అన్నారు. దీంతో అశ్వినీ తన అభిప్రాయాలను చెప్పారు.

పల్లవి ప్రశాంత్ కొన్నిసార్లు అసలు మాటే వినడని అశ్వినీ అన్నారు. అయితే, శివాజీలా మిమిక్రీ చేసి చెబితే ప్రశాంత్ వింటాడని నాగ్ సరదాగా అన్నారు. బిగ్‍బాస్ హౌస్‍లో ప్రిన్స్ యావర్ తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడని అశ్వినీ చెప్పారు. అతడితో ఇంత ఫ్రెండ్‍షిప్ అవుతుందని అనుకోలేదని అన్నారు. “యావర్ నీతో తెలుగులో మాట్లాడుతున్నాడా” అని నాగ్ అడిగారు. దీంతో అవునని అశ్వీని చెప్పారు. ఆడపిల్లలతో మాట్లాడతాడులే అని నాగార్జున సరదాగా అన్నారు. ప్రియాంక మంచిదే కానీ.. తొందరపాటు ఎక్కువని అశ్వినీ అన్నారు. ప్రియాంక ఫ్లాఫ్ అని తేల్చేశారు.

హౌస్‍లో రెండు గ్రూప్‍లు

బిగ్‍బాస్ హౌస్ గ్రూపులుగా విడిపోయిందని నాగార్జునతో అశ్వినీ శ్రీ చెప్పారు. “ప్రియాంక, శోభ, అమర్.. ముగ్గురు ఒక గ్రూప్. శివాజీ, రతిక, యావర్, ప్రశాంత్ ఒక గ్రూప్” అని అశ్వినీ చెప్పారు. “ఏకాకిలా మిగిలి పోయి నాకు ఏం చేయాలో అర్థం కాకుండా అలా అయిపోయింది” అని అన్నారు. తాను ఏకాకి దాంట్లో కూడా లేనా అని అంబటి అర్జున్ అన్నారు. దీంతో అర్జున్ అసలు దేంట్లో కూడా లేడని నాగార్జున పంచ్ వేశారు. అర్జున్ చేస్తాడోనన్న భయం వేస్తోందని అన్నారు.

రతిక ఎలిమినేట్!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో నేటి ఆదివారం ఎపిసోడ్‍లో రతిక రోజ్ ఎలిమినేట్ కానున్నారని లీక్స్ వచ్చాయి. రతిక, అర్జున్ డేంజర్ జోన్‍లో ఉండగా.. ఎవిక్షన్ పాస్‍ను ఉపయోగించి అర్జున్‍ను పల్లవి ప్రశాంత్ కాపాడాడని తెలుస్తోంది. దీంతో రతిక ఎలిమినేట్ అయినట్టు లీకుల ద్వారా వెల్లడైంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది.

IPL_Entry_Point