Bigg Boss 7 Telugu Elimination: ట్విస్టుల్లేవ్.. హౌస్‍ నుంచి ఒకరే ఎలిమినేట్-bigg boss 7 telugu shakila eliminated in second week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Shakila Eliminated In Second Week

Bigg Boss 7 Telugu Elimination: ట్విస్టుల్లేవ్.. హౌస్‍ నుంచి ఒకరే ఎలిమినేట్

Bigg Boss 7 Telugu Elimination: ట్విస్టుల్లేవ్.. హౌస్‍ నుంచి ఒకరే ఎలిమినేట్ (Photo: Star Maa)
Bigg Boss 7 Telugu Elimination: ట్విస్టుల్లేవ్.. హౌస్‍ నుంచి ఒకరే ఎలిమినేట్ (Photo: Star Maa)

Bigg Boss 7 Telugu Elimination: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ రెండో వారం ట్విస్టుల్లేకుండానే ముగిసింది. డబుల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ లాంటివి జరగలేదు. ఊహించిన కంటెస్టెంటే హౌస్ నుంచి బయటికి వెళ్లారు.

Bigg Boss 7 Telugu Elimination: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ రెండో వారం ముగిసింది. ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే, రూమర్లు వచ్చిన విధంగా డబుల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటివి ట్విస్టులు ఈవారం ఇవ్వలేదు బిగ్‍బాస్. ఆదివారం హౌస్ నుంచి ఒక్కరే ఎలిమినేట్ అయ్యారు. ఓటింగ్లో ప్రకారం వెనుకబడి ఉన్న షకీల రెండో వారం బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఈ ప్రక్రియ ఎలా సాగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

ముందుగా నామినేషన్లలో ఉన్న ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, షకీల, టేస్టీ తేజ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‍కు బాక్సులు ఇచ్చారు నాగార్జున. ఆ బాక్సుల్లో హ్యాపీ స్మైలింగ్ ఫేస్ ఉంటే సేఫ్.. యాంగ్రీ ఎమోజీ అయితే నాట్ సేఫ్ అని నాగార్జున చెప్పారు. దీంట్లో ప్రిన్స్ యావర్ సేఫ్ అయ్యారు. అనంతరం శోభాశెట్టి, రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, షకీల, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్‍కు మరో ప్రక్రియ జరిగింది. వారికి బాక్సులు ఇచ్చి అందులో ఉన్న తాళానికి గ్రీన్ మార్క్ ఉంటే సేఫ్ అని, రెడ్ మార్క్ ఉండే నాట్ సేఫ్ అని నాగార్జున చెప్పారు. దీంట్లో రతిక సేఫ్ అయ్యారు. ఆ తర్వాత హౌస్‍లో మీకు కట్టప్ప ఎవరు.. భళ్లాలదేవ ఎవరు? అని నాగార్జున ప్రశ్నించగా.. కంటెస్టెంట్లు అందరూ వారి అభిప్రాాయాలను బట్టి పేర్లు, కారణాలు చెప్పారు.

అనంతరం ఎలిమినేషన్ ప్రకియలో శోభాశెట్టి, షకీల, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్‍, గౌతమ్ కృష్ణకు మరో గేమ్ వచ్చింది. దీంట్లో భాగంగా ఓ హ్యాట్ ఇచ్చి దాన్ని కంటెస్టెంట్ పెట్టుకున్నప్పుడు గాడిద సౌండ్ వస్తే వారు అన్ సేఫ్ అని, బుల్ (ఎద్దు) సౌండ్ వస్తే సేఫ్ అని నాగార్జున చెప్పారు. దీంట్లో బుల్ సౌండ్‍తో శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సేఫ్ అయ్యారు.

టేస్టీ తేజ, షకీల, గౌతమ్ కృష్ణ మధ్య మరో గేమ్‍ జరిగింది. దీంట్లో గౌతమ్ సేఫ్ అయ్యారు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ చివరి స్టేజ్ టేస్టీ తేజ, షకీల మధ్య సాగింది. అక్కడ మాయాస్త్రం ఉందని, అద్భుతం మొదలవుతుందని నాగార్జున చెప్పారు. దాంట్లో ఫొటో వచ్చిన వాళ్లు సేఫ్ అని చెప్పారు. దాంట్లో టేస్టీ తేజ ఫొటో వచ్చింది. దీంతో షకీల ఎలిమినేట్ అయ్యారు. బిగ్‍బాస్ 7వ సీజన్‍లో ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్‍గా షకీల హౌస్ నుంచి బయటికి వచ్చారు. షకీల హౌస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‍లో 12 మంది మిగిలారు.

కాగా, కొన్ని ట్యాగ్‍లను చెప్పి ఎవరిని ఎంపిక చేస్తారని స్టేజీపైకి వచ్చిన షకీలను నాగార్జున అడిగారు. ఫ్రెండ్లీ నేచర్‌కు ప్రియాంకా జైన్‍ను, కుళ్లు బోతు ట్యాగ్‍కు ప్రిన్స్ యావర్‌ను, ఆవేశపరుడు ట్యాగ్‍కు పల్లవి ప్రశాంత్‍ను షకీల చెప్పారు. వారి ఫొటోలపై పెయింట్ వేశారు. నమ్మకస్తులు మాటకు సింగర్ దామిని పేరు చెప్పారు షకీల. స్టోన్ హార్టెడ్ రతిక రోజ్ అని, ఆనందం పంచే వారు అనే ట్యాగ్‍కు శివాజీ పేరు చెప్పారు షకీల.

ఫన్ యాక్టివిటీలో భాగంగా హీరో ఫొటోలను చూపించి గెస్ చేసే గేమ్‍ను కంటెస్టెంట్‍లకు పెట్టారు నాగార్జున. గెస్ చేసిన హీరోకు సంబంధించిన పాటలకు డ్యాన్స్ చేయించారు. ఇది సరదాగా సాగింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.