Bigg Boss Nominations: దద్దరిల్లిపోయిన బిగ్ బాస్ హౌజ్.. పాట బిడ్డకే అత్యధిక ఓట్లు.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ హోరా హోరీగా సాగింది. బూతులు, అరుపులు, గొడవలతో రచ్చ లేపారు హౌజ్ మేట్స్. ఇందులో అత్యధికంగా పాటబిడ్డకు నామినేషన్లు ఓట్లు పడ్డాయి.
Bigg Boss 7 Telugu 7th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం నామినేషన్లు భలే రంజుగా సాగాయి. ఒకరి మీద మరొకరు కారణాలు చెబుతూ నామినేట్ చేశారు. ఈ క్రమంలో బూతులు, గొడవలు, అరుపులతో బిగ్ బాస్ హౌజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. సోమవారం (అక్టోబర్ 16) ప్రారంభమైన బిగ్ బాస్ 7వ వారం నామినేషన్ల పరంపర మంగళవారం (అక్టోబర్ 17) వరకు జరిగింది. ఈ క్రమంలో భోలే షావలిని శోభా శెట్టి నామినేట్ చేసింది.
భయం దూరం చేసుకోవాలి
బిగ్ బాస్ నామినేషన్లలో భాగంగా శోభా శెట్టి-భోలే షావలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో భోలే బూతులు మాట్లాడటంతో ప్రియాంక మధ్యలోకి దూరింది. దీంతో గొడవ తారా స్థాయికి చేరింది. భోలే, టేస్టీ తేజను శోభా శెట్టి నామినేట్ చేసింది. అనంతరం.. గౌతమ్, అమర్ దీప్‌లను హీరో శివాజీ నామినేట్ చేశాడు. భయపడుతున్నావని, అది దూరం చేసుకోవాలని గౌతమ్‌ని, స్ప్రైట్, చాక్లెట్ వంటి చిన్న చిన్నవాటికి గొడవ పడొద్దని అమర్‌ను నామినేట్ చేస్తూ కారణాలు చెప్పాడు శివాజీ.
పాట బిడ్డకు ఏడు ఓట్లు
తర్వాత వచ్చిన అశ్విని శ్రీ.. పూజా మూర్తి, అర్జున్ అంబటిని నామినేట్ చేసింది. అనంతరం శివాజీ, భోలేని గౌతమ్ నామినేట్ చేశాడు. ఇక తన టర్న్ తీసుకున్న భోలే.. శోభా శెట్టి, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్ ప్రిన్స్ యావర్.. గౌతమ్ కృష్ణ అండ్ అమర్ దీప్‌లను నామినేట్ చేశాడు. ఇలా హోరో హోరీగా సాగిన నామినేషన్ల ప్రక్రియలో పాట బిడ్డగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్ భోలేకు అత్యధికంగా7 నామినేషన్ ఓట్లు పడ్డాయి.
నామినేషన్లలో ఏడుగురు
భోలేను.. అమర్ దీప్, అర్జున్ అంబటి, పూజా మూర్తి, ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్, ఆట సందీప్ నామినేట్ చేశారు. భోలే తర్వాత ఎక్కువగా అశ్విని శ్రీకి ఓట్లు పడ్డాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 7 తెలుగు ఏడో వారం నామినేషన్లలో మొత్తంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. భోలే షావలి, అశ్విని శ్రీ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు.
టాపిక్