OTT Horror Movies: ఓటీటీలో భయపెట్టే బెస్ట్ 5 తెలుగు హారర్ సినిమాలు- దడుసుకునే ట్విస్టులు- అస్సలు మిస్ కావొద్దు!
Best OTT Telugu Horror Movies On Aha: ఆహా ఓటీటీలో దడుసుకునే ట్విస్టులు, భయపెట్టే బీజీఎమ్, థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ ఐదు బెస్ట్ హారర్ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు. మరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ 5 తెలుగు హారర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Best Horror Movies In Aha Telugu: హారర్ సినిమాలు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దడుసుకునే ట్విస్టులు, ఎంగేజింగ్‌గా థ్రిల్లింగ్‌గా సాగే కథనంతో పాత కథైన కొత్తగా చెబితే హారర్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటాయి. ఈ మధ్య తెలుగులో కూడా అనేక హారర్ సినిమాలు వచ్చాయి. ఆహా ఓటీటీలో భయపెట్టే బెస్ట్ 5 తెలుగు హారర్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
మసూద ఓటీటీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ప్రేక్షకులను బాగా భయపెట్టిన సినిమా మసూద. కథ, కథనాలు, యాక్టర్స్ పర్ఫామెన్స్‌తో మసూద మూవీ అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది చూసినప్పటికీ హారర్ మూవీస్ ఇష్టపడే వారు కచ్చితంగా మిస్ కాకూడని సినిమా మసూద.
తంత్ర ఓటీటీ
వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల నటించిన తెలుగు హారర్ మూవీనే తంత్ర. హీరోయిన్ సలోని, టెంపర్ వంశీ, ధనుష్ రఘముద్రి, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోయింది. కొన్ని ఫాల్స్ ఉన్నప్పటికీ తెలుగు హారర్ సినిమాల్లో తంత్ర కూడా చూడాల్సిన చిత్రం. రేఖ అనే అమ్మాయికి తరచు దెయ్యాలు ఎందుకు కనపడుతున్నాయి, తన నేపథ్యం ఏంటీ వంటి విషయాలతో ఆసక్తికరంగా సాగుతుంది ఈ మూవీ.
పిండం ఓటీటీ
మోస్ట్ స్కేరియెస్ట్ ఫిల్మ్ ఎవర్ (అత్యంత భయపెట్టే సినిమా) అనే క్యాప్షన్‌తో వచ్చిన తెలుగు హారర్ మూవీ పిండం. హీరో శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇద్దరు ఆడ పిల్లలు, గర్భిణీ అయిన భార్యతో ఓ ఇంట్లోకి వెళ్లిన హీరోకు ఎదురైన సంఘటనలు ఏంటీ అనే కథాశంతో సినిమా సాగుతుంది. సినిమాలో ప్లాష్‌బ్యాక్, చిన్నపిల్లలను చంపే సీన్స్ భయపెట్టేలా ఉంటాయి. కాబట్టి ఇది కూడా కచ్చితంగా చూడాల్సిన సినిమా.
105 మినిట్స్ ఓటీటీ
దేశముదురు హీరోయిన్ హన్సిక నటించిన హారర్ థ్రిల్లర్ మూవీనే 105 మినిట్స్. ఒకే టెంప్లేట్‌లో కాకుడా డిఫరెంట్ హారర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఈ చిత్రం మంచి ఆప్షన్. మొదటి నుంచి చివరి వరకు ఒక్క క్యారెక్టర్‌తో మూవీని తెరకెక్కించడం పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. అయితే, ఆ విషయంలో డైరెక్టర్ అంత సక్సెస్ కాలేకపోయినా మూవీలోని ప్లాట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కాబట్టి, ఈ సినిమాపై కూడా ఓసారి లుక్కేయొచ్చు.
రేయికి వేయి కళ్లు ఓటీటీ
రేయికి వేయి కళ్లు తెలుగులో డబ్బింగ్ అయిన తమిళ హారర్ సినిమా. అరుళ్ నిథి భరత్ హీరోగా తెరకెక్కిన ఇరవుక్కు ఆయిరామ్ కంగళ్ అనే సినిమాను తెలుగులో డబ్ చేశారు. స్టైట్ తెలుగు సినిమా కానప్పటికీ హారర్ సినిమాల్లో ఇది ఒక మంచి థ్రిల్లింగ్ మూవీ. థ్రిల్లర్ జోనర్‌కు కాస్తా హారర్ ఎలిమెంట్స్ జోడించి తీసిన ఈ మూవీ కూడా బెస్ట్ ఆప్షన్.
మరిన్ని హారర్ సినిమాలు
ఇవే కాకుండా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న పొలిమేర 2, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి సినిమాలు కూడా మంచి హారర్ థ్రిల్ ఇస్తాయి. వీటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది మాత్రం కామెడీ హారర్ జోనర్‌లో తెరకెక్కింది. ఇందులో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.