Balagam Swedish Film Festival: బలగం సినిమాకు మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డులు
Balagam Swedish Film Festival: బలగం సినిమా మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నది. ఆ అవార్డులు ఏవంటే....
Balagam Swedish Film Festival: తెలుగులో చిన్న సినిమాగా విడుదలై అఖండ విజయాన్ని సాధించిన బలగం మూవీ పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫిస్టెవల్స్‌లో అవార్డులను అందుకుంటూ సత్తాచాటుతోంది. తాజాగా స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో బలగం మూవీ రెండు అవార్డులను అందుకున్నది.
బెస్ట్ యాక్టర్‌గా ప్రియదర్శి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా కేతిరి సుధాకర్ రెడ్డి అవార్డులను దక్కించుకున్నారు. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గతంలో ఫహాద్ ఫాజిల్ మలయాళం మూవీ జోజితో పాటు నాయట్టు అవార్డులను అందుకున్నాయి.
వాటి తర్వాత ఈ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు సొంతం చేసుకున్న మూవీగా బలగం నిలిచింది.
30 కోట్ల కలెక్షన్స్…
బలగం సినిమాతో కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చావు నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలకు కామెడీని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా థియేటర్లలో 30 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
ఈ ఏడాది నిర్మాతలకు అత్యధిక లాభాల్ని మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ హీరోయిన్లుగా నటించారు. కోటజయరాం, కొమ్ము సుజాత, మురళీధర్‌గౌడ్ కీలక పాత్రలను పోషించారు.