Balagam Tv Premiere Date: బలగం టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే
Balagam Tv Premirer Date: ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన బలగం మూవీ టీవీలోకి రాబోతున్నది. ఈ సినిమా ట్రీవీ ప్రీమియర్ డేట్ ఏదంటే...
Balagam Tv Premiere Date: సిల్వర్‌స్క్రీన్‌తో పాటు ఓటీటీలో అద్భుత విజయాన్ని దక్కించుకొన్న బలగం సినిమా టీవీలోకి రాబోతున్నది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్‌ను సోమవారం రివీల్ చేశారు.
స్టార్‌మా ఛానెల్‌లో మే 7వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు బలగం టెలికాస్ట్ కానుంది. ఇదే ఫస్ట్ టీవీ ప్రీమియర్ కావడంతో బలగం మూవీకి టీఆర్‌పీ రేటింగ్స్ భారీగానే వచ్చే అవకాశం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలగం సినిమాతో కమెడియన్ వేణు టిల్లు డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
చావు నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, అప్యాయతలకు అద్దంపడుతూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలతో పాటు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రిలీజైన ఈ మూవీ ముప్పై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలను మిగిల్చింది.
ఈ ఏడాది అత్యధిక లాభాల్ని మిగిల్చిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శితో పాటు కోట జయరాం, రూపలక్ష్మి, మైమ మధుతో పాటు ప్రతి ఒక్కరు అద్భుత నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ అక్కడ కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. బలగం సినిమాను దిల్‌రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్‌రెడ్డి కలిసి నిర్మించారు.