Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. వచ్చేస్తోంది!
Amazon Great Summer Sale : అదిరిపోయే డిస్కౌంట్లు, ఆఫర్స్‌తో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ భారతీయులను పలకరించనుంది! ఈ సేల్కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తోంది! సేల్‌ను తన వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించింది దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. 2023 మే 4న ఈ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభమవుతుంది. ఫలితంగా.. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, హోం అప్లియెన్సెస్తో పాటు అనేక ప్రాడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి!
ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్‌కు ముందుగానే..!
ఎప్పటిలాగే.. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్‌కు ఈ సేల్ ముందుగానే అందుబాటులో ఉండనుంది. 12 గంటల ముందే వీరికి సేల్ మొదలవుతుంది. ఇక ఈ గ్రేట్ సమ్మర్ సేల్‌లో వివిధ బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది అమెజాన్. ఐసీఐసీఐ, కొటాక్ బ్యాంక్ కార్డులు ఉన్న వారికి 10శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
Amazon Great Summer Sale 2023 : గ్రేట్ సమ్మర్ సేల్కు సంబంధించి ఓ వెబ్‌పేజ్‌ను సైతం రూపొందించింది అమెజాన్. సేల్‌లోకి వస్తున్న ప్రాడక్ట్స్, డిస్కౌంట్లపై సరైన సమాచారం అందులో లేనప్పటికీ.. వివిధ ప్రైజ్ కేటగిరీల్లోని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నట్టు మాత్రం స్పష్టమవుతోంది.
మొబైల్ కేటగిరీలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్‌ను డిస్కౌంట్లో రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు! అదే విధంగా రెడ్మీ 12సీ రూ. 8999కే లభిస్తుందని పేజ్‌లో ఉంది. వన్‌ప్లస్ బులెట్ జెడ్2 ధర రూ. 1,599కి తగ్గింది.
Amazon Great Summer Sale date 2023 : ఈ గ్రేట్ సమ్మర్ సేల్‌లో టీవీతో పాటు ఇతర అప్లియెన్సెస్‌పై 60శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. వన్‌ప్లస్ వై సిరీస్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 14,999గా ఉంది. ఎల్జీ 190ఎల్ సింగిల్ డోర్ రిఫ్రిజరేటర్ ధర రూ. 17,490గా ఉండటం విశేషం. అదే సమయంలో ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ డ్యూయెల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ. 46,490కి తగ్గింది.
ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్ సెగ్మెంట్లో జెబ్రానిక్ హాజ్ వయర్లెస్ మౌస్ రూ. 249కే దక్కుతుందని తెలుస్తోంది. ఫైర్ బోల్ట్ నింజా సాల్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 1,699గా ఉండే అవకాశం ఉంది.
సేల్ టైమ్ సమీపించే కొద్ది.. డిస్కౌంట్లు, ఆఫర్లపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే..
Flipkart big saving days 2023 : బిగ్ సేవింగ్స్ డేను తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. మే 5న ఇది ప్రారంభమవుతుంది. మే 10వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 13తో పాటు పలు ఇతర స్మార్ట్‌ఫోన్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం