Bigg Boss 7 Telugu Elimination: బిగ్‍బాస్ నుంచి ఆమె ఎలిమినేట్.. కొంప ముంచిన సెల్ఫ్ నామినేషన్!
Bigg Boss 7 Telugu Elimination: బిగ్‍బాస్ 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. అయితే, ఎలిమినేట్ అయ్యే ఓ కంటెస్టెంట్ ఎవరో లీకుల ద్వారా తెలిసిపోయింది. శనివారమే ఆమె బయటికి వెళ్లే అవకాశం ఉంది. ఆ వివరాలివే..
Bigg Boss 7 Telugu Elimination: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 12 వారం ముగింపునకు వచ్చింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హింట్లు వచ్చాయి. దీంతో శనివారం (నవంబర్ 25) ఎపిసోడ్‍లోనే ఓ కంస్టెంట్ ఎలిమినేట్ అవడం ఖాయంగా తెలుస్తోంది. అయితే, ఈ వారం ముందుగా ఎవరు ఎలిమినేట్ కానున్నారో సమాచారం లీక్ అయింది.
12వ వారంలో పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, రతిక, అశ్వినీ శ్రీ నామినేషన్లలో ఉన్నారు. అశ్వినీ మాత్రం తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. ఇక అశ్వినీకి తక్కువ ఓట్లు వచ్చినట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. దీంతో శనివారం ఎపిసోడ్‍లో అశ్వినీ శ్రీ.. బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లీకులు వచ్చాయి. హౌస్ నుంచి అశ్వినీ బయటికి వెళ్లనున్నారని సమాచారం బయటికి వచ్చింది.
అశ్వినీ కూడా ఎలిమినేట్ అయిపోతే.. బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఐదుగురులో హౌస్‍లో అర్జున్ మాత్రమే మిగులుతారు. సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవడమే అశ్వినీ కొంప ముంచిందని తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున కూడా అదే విషయాన్ని చెప్పారు.
శనివారం ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. ఈ వారం సింగిల్ ఎలిమినేషనా.. డబుల్ ఎలిమినేషనా అని అశ్వినీని నాగ్ ప్రశ్నించారు. డబుల్ ఎలిమినేషన్ అని అశ్వినీ ఆన్సర్ ఇచ్చారు. “డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటావా.. కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా.. మనం చేసే పొరపాట్ల వల్లే మనం బలైపోతాం” అని నాగార్జున అన్నారు. దీంతో అశ్వినీ ఎలిమినేట్ కానున్నారని హింట్ ఇచ్చేశారు.
డబుల్ ఎలిమినేషన్ ప్రకారం.. ఆదివారం ఎపిసోడ్‍లో మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఇది ఎవిక్షన్ పాస్ వాడకంపై ఆధారపడి ఉంటుంది. పల్లవి ప్రశాంత్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ఉపయోగించి ఒకరిని కాపాడే ఛాన్స్ కూడా ఉంది. అయితే, అతడు దాన్ని వినియోగించకపోతే.. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది.