Anupama Parameswaran: ‘వాళ్లలాగే మీరు అనుకున్నా.. కానీ’ అంటూ బాధ వ్యక్తం చేసిన అనుపమ అభిమాని.. వీడియో వైరల్
Anupama Parameswaran Fan Viral Video: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెకు ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‍గా మారింది.
Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు అభినయంతో చాలా మంది అభిమానులను సంపాదించున్నారు. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తన సినీ కెరీర్‌లో చాలా కాలం గ్లామర్ షో, బోల్డ్ క్యారెక్టర్లకు దూరంగానే ఉన్నారు అనుపమ. చాలా సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. అయితే, 2022లో వచ్చిన రౌడీబాయ్స్ చిత్రంలో కాస్త బోల్డ్‌గా చేశారు అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వైర్ సినిమాలో రొమాంటికల్ రోల్ చేశారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రాగా.. సిద్దు, అనుపమ లిప్‍లాక్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.
టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ బోల్డ్ క్యారెక్టర్ చేయడంపై ఆమె అభిమానులు కొందరు ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలోనూ కొందరు ఈ విధంగా పోస్టులు పెట్టారు. తాజాగా, అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ఒకరు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. టిల్లు స్క్వేర్ ఎందుకు తీశారని, దయచేసి మంచి క్యారెక్టర్లు ఉన్న సినిమాలు చేయండని ఆయన అనుపమను కోరారు. గత చిత్రాలను కూడా గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
అనుపమ అభిమాని ఆవేదన ఇదే
“ఏమండి అనుపమ గారు నా ఆటోలో మీ ఫొటో ఎందుకు వేసానో తెలుసా.. ఒకప్పుడు మీరు తీసిన సినిమా అలాంటిదండి. అఆ సినిమా చూసి మిమ్మల్ని ఇష్టపడని వారు ఉంటారు. శతమానం భవతి సినిమాలో అసలు మరదలు అంటే మీలా ఉండాలనేలా చేశారు. అఆ, శతమానంభవతి, ఉన్నదిఒకటే జింగది, హాలోగురూ ప్రేమ కోసమే.. ఎలాంటి సినిమాలు తీశారండి. అసలు హలో గురూ ప్రేమకోసమే సినిమాలో కాఫీ సీన్‍లో మీరా కాదా అనే మేం ఎంతో టెన్షన్ పడ్డాం. అలాంటిది మీరు ఇప్పుడు ఎలాంటి సీన్లు తీస్తున్నారండి. రౌడీ బాయ్స్, టిల్లు 2 (టిల్లు స్క్వేర్) ఎందుకండి మీకు ఇలాంటి సినిమాలు” అని ఆ అభిమాని అన్నారు.
సౌందర్య, సావిత్రిలా అనుపమను అనుకున్నామని, అయితే ఆమె ఇలాంటి పాత్రలు చేయడం తమకు నచ్చడం లేదని ఆయన చెప్పారు. “ఒకప్పుడు సౌందర్య గారు, సావిత్రి గారు ఎలాంటి సినిమాలు తీశారండి. వాళ్లలాగే మిమ్మల్ని అనుకున్నాం. కానీ మీరు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయడం మాకేం నచ్చడం లేదండి. ఒక అభిమానిగా చెబుతున్నాను. దయచేసి కొంచెం మంచి క్యారెక్టర్లు ఉన్న సినిమాలు చేయండి” అని ఆ ఫ్యాన్ చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతడికి కొందరు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, నటిగా అన్ని రకాల పాత్రలు చేస్తారని, ఇందులో బాధపడేందుకు ఏముందని కొందరు రాసుకొస్తున్నారు.
టిల్లు స్క్వేర్ గురించి..
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన డీజే టిల్లుకు సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లో సిద్ధు, అనుపమ లిప్‍లాక్ రొమాన్స్ డోస్ ఎక్కువగానే ఉంది.