Animal OTT Streaming: యానిమల్‌లో ఆ ఇద్దరి కిస్సింగ్ సీన్ డిలీట్.. ఓటీటీలో చూసే ఛాన్స్-animal ott streaming deleted kissing scene between ranbir and bobby deol to be included ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Ott Streaming: యానిమల్‌లో ఆ ఇద్దరి కిస్సింగ్ సీన్ డిలీట్.. ఓటీటీలో చూసే ఛాన్స్

Animal OTT Streaming: యానిమల్‌లో ఆ ఇద్దరి కిస్సింగ్ సీన్ డిలీట్.. ఓటీటీలో చూసే ఛాన్స్

Hari Prasad S HT Telugu
Dec 14, 2023 07:39 AM IST

Animal OTT Streaming: యానిమల్‌ మూవీలో రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ మధ్య ఓ కిస్సింగ్ సీన్ ఉంది. థియేటర్లలో డిలీట్ చేసిన ఈ సీన్ ను ఓటీటీలో చూసే ఛాన్స్ కల్పించే అవకాశం ఉంది.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్

Animal OTT Streaming: యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజైనప్పటి నుంచీ సంచలనాలు క్రియేట్ చేస్తూనే ఉంది. ఎన్ని విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీలో రణ్‌బీర్, బాబీ డియోల్ కిస్సింగ్ సీన్ ను థియేటర్లలో మిస్ అయిన ఫ్యాన్స్ కు ఓటీటీలో చూసే అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

యానిమల్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.755 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు రూ.467.85 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 లేదా 15 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు థియేటర్లలో డిలీట్ చేసిన ఓ సీన్ ను కూడా ఓటీటీలో చేర్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

అసలేంటీ కిస్సింగ్ సీన్?

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ పాత్రకు, తన పాత్రకు మధ్య సినిమాలో ఉన్న బంధం గురించి చెప్పాడు. ప్రేమ, ద్వేషం కలగలసిన బంధమది. దీని గురించి చెబుతూ.. క్లైమ్యాక్స్ ఫైట్ సీన్ ఎలా జరిగిందో వివరించాడు. "ఈ ఇద్దరు సోదరులు ఒకరినొకరు చంపాలని అనుకుంటారు. కానీ వాళ్ల మధ్య ప్రేమ కూడా ఉంది. అందుకే క్లైమ్యాక్స్ ఫైట్ లో బ్యాక్‌గ్రౌండ్ లో ప్రేమ గురించిన పాట వస్తుంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారు" అని బాబీ చెప్పాడు.

క్లైమ్యాక్స్ లో బీ ప్రాక్ పాడిన దునియా జలా దేంగే అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. నిజానికి తమ పాత్రల మధ్య ఓ కిస్ సీన్ కూడా ఉందని బాబీ వెల్లడించాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆ సీన్ తనకు ఎలా వివరించాడో బాబీ చెప్పాడు. "మీరు ఫైట్ చేస్తూ ఉంటారు.. నువ్వు సడెన్ గా కిస్ చేస్తావు. అయినా వదిలి పెట్టవు. అతడు నిన్ను చంపేస్తాడు అని సందీప్ చెప్పాడు. ఇద్దరి మధ్యా ఓ కిస్ ఉంది. కానీ అతడు ఆ సీన్ డిలీట్ చేశాడు. బహుశా ఆ సీన్ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ లో చూడొచ్చు" అని బాబీ డియోల్ చెప్పాడు.

యానిమల్ మూవీలో రణ్‌విజయ్ సింగ్ పాత్రలో రణ్‌బీర్ నటించగా.. అబ్రార్ అనే విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించాడు. బాబీ పాత్ర మూగది కావడం గమనార్హం. ఈ ఇద్దరి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో మూవీపై ఎన్ని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం కోట్ల వర్షం కురిపిస్తూనే ఉంది.