Animal Jamal Kudu song out: యానిమల్ సూపర్ హిట్ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియో వచ్చేసింది-animal jamal kudu song full video out abrar entry song from animal gone vial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Jamal Kudu Song Out: యానిమల్ సూపర్ హిట్ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియో వచ్చేసింది

Animal Jamal Kudu song out: యానిమల్ సూపర్ హిట్ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియో వచ్చేసింది

Hari Prasad S HT Telugu
Dec 13, 2023 03:19 PM IST

Animal Jamal Kudu song out: బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న యానిమల్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియో వచ్చేసింది. బుధవారం (డిసెంబర్ 13) మేకర్స్ ఈ వీడియోను రిలీజ్ చేశారు.

యానిమల్ మూవీలోని జమాల్ కుదు సాంగ్‌లో బాబీ డియోల్
యానిమల్ మూవీలోని జమాల్ కుదు సాంగ్‌లో బాబీ డియోల్

Animal Jamal Kudu song out: యానిమల్ మూవీలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పార్శీ సాంగ్ జమాల్ కుదు ఫుల్ వీడియోను బుధవారం (డిసెంబర్ 13) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అబ్రార్ అనే విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ పాట వస్తుంది. ఈ భాష ఎవరికీ తెలియకపోయినా.. మ్యూజిక్ మాత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

దీంతో జమాల్ కుదు సాంగ్ కు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఎంతో మంది ఈ సాంగ్ పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నారు. దీంతో యానిమల్ మేకర్స్ ఈ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో టీ-సిరీస్ ఈ వీడియో రిలీజ్ చేసిన గంటలోనే మిలియన్ వ్యూస్ వరకూ రావడం విశేషం. బాబీ డియోల్ అబ్రార్ పాత్ర తలపై మందు గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది.

తన మూడో పెళ్లి సందడిలో భాగంగా బ్యాక్‌గ్రౌండ్ లో సింగర్స్ ఈ పార్శీ సాంగ్ పాడుతుంటే.. అబ్రార్ చాలా ఖుషీగా కనిపిస్తాడు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హర్షవర్దన్ రామేశ్వర్.. ఈ పాపులర్ ఇరానియన్ బండారీ మ్యూజిక్ ను కాస్త కొత్తగా వినిపించడానికి ప్రయత్నించాడు. ఈ పాటలో వినిపించే చిన్నారుల గళాన్ని సౌనిక్, హర్షిత, కీర్తన, వాగ్దేవి అందించారు.

ఇక యువతి వాయిస్ ను మేఘనా నాయుడు, సాబిహా, ఐశ్వర్య దాసరి, అభీక్య అందించడం విశేషం. చాలా కొత్తగా అనిపించే ఈ పాటను భాష అర్థం కాకపోయినా ఎంతో మంది ఇండియన్ ఫ్యాన్స్ తెగ వినేస్తున్నారు. ఈ ట్యూన్స్ కి స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు వారిని మరింత అలరించడానికి ఫుల్ వీడియో వచ్చేసింది.

మరోవైపు యానిమల్ మూవీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.757 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.