Animal Movie OTT: యానిమల్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే!
Animal Movie OTT: యానిమల్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ప్లాట్‍ఫామ్ గురించి సమాచారం బయటికి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే..
Animal Movie OTT: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రానికి బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో.. బంపర్ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో తెలుగులోనూ ఈ సినిమాకు ఫుల్ హైప్ ఉంది. అందుకు తగ్గట్టే స్ట్రైట్ తెలుగు మూవీలా తొలి రోజు బుకింగ్స్ జరిగాయి. ఇక యానిమల్ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా, యానిమల్ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటికి వచ్చాయి.
యానిమల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ఉంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. 2024 జనవరి మూడు లేదా నాలుగో వారంలో యానిమల్ సినిమా నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు వెలువడుతున్నాయి. జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని కూడా అంచనాలు ఉన్నాయి.
యానిమల్ సినిమా టాక్ ఎక్కువ శాతం పాజిటివ్‍గా వస్తోంది. వైలెంట్, ఎమోషనల్ క్యారెక్టర్‌లో రణ్‍బీర్ కపూర్ యాక్టింగ్‍కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై కూడా సంతృప్తి వ్యక్తమవుతోంది. దాదాపు ఈ చిత్రం అంచనాలను అందుకుందని జనాల టాక్. అయితే, వైలెన్స్, బోల్డ్ కంటెంట్, రన్ టైమ్ ఎక్కువగా ఉండడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.
యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్ సరసన హీరోయిన్‍గా రష్మిక మందన్న చేశారు. రణ్‍బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. ప్రధాన విలన్ పాత్రను బాబీ డియోల్ పోషించారు. త్రిప్తి దిమ్రి, అహ్మద్ ఉమర్, బంబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్, చారు శంకర్ కీరోల్స్ చేశారు.
యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రం కోసం పని చేశారు.
సంబంధిత కథనం