Mission Chapter 1: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన అమీజాక్స‌న్ యాక్ష‌న్ మూవీ - తెలుగు ఫ్యాన్స్‌కు ట్విస్ట్‌-amy jackson mission chapter one movie streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amy Jackson Mission Chapter One Movie Streaming Now On Amazon Prime Video

Mission Chapter 1: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసిన అమీజాక్స‌న్ యాక్ష‌న్ మూవీ - తెలుగు ఫ్యాన్స్‌కు ట్విస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2024 08:23 AM IST

Mission Chapter 1: అమీజాక్సన్ హీరోయిన్‌గా న‌టించిన మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మిష‌న్ ఛాప్ట‌ర్ 1 మూవీ
మిష‌న్ ఛాప్ట‌ర్ 1 మూవీ

Mission Chapter 1: మిష‌న్ ఛాప్ట‌ర్ 1 మూవీతో దాదాపు ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది అమీజాక్స‌న్‌. అరుణ్ విజ‌య్ హీరోగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. రొటీన్ స్టోరీ కార‌ణంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండు నెల‌ల త‌ర్వాత మిష‌న్ ఛాప్ట‌ర్ 1 మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఏఎల్ విజ‌య్ డైరెక్ట‌ర్‌...

తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి రూపొందించిన మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్‌ సినిమాకు ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమెజాన్ ప్రైమ్‌లో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ శుక్ర‌వారం త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజైంది. తెలుగు వెర్ష‌న్‌పై మేక‌ర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

థియేట‌ర్ల‌లో తెలుగులో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్ రిలీజ్ చేశారు. కానీ సంక్రాంతికి స్ట్రెయిట్ సినిమాల పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ తెలుగు వెర్ష‌న్ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. సంక్రాంతి త‌ర్వాత ఓ వారం గ్యాప్ తీసుకొని థియేట‌ర్ల ద్వారా ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు.

కానీ త‌మిళంలో డిజాస్ట‌ర్ కావ‌డంతో తెలుగు వెర్ష‌న్‌పై ఎఫెక్ట్ గ‌ట్టిగా ప‌డింది. తెలుగులో రిలీజే కాలేదు. థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనైనా తెలుగు వెర్ష‌న్‌ను రిలీజ్ చేస్తార‌ని అనుకున్నారు. అది కూడా జ‌ర‌గ‌లేదు.

మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ క‌థ ఇదే...

హాస్పిట‌ల్‌లో ప్రాణాల‌తో పోరాడుతోన్న త‌న కూతురుని క‌లుసుకోవ‌డానికి ఓ ఖైదీఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో అత‌డు ఖైదీగా మార‌డానికి కార‌ణం ఏమిటి అనే అంశాల‌తో మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్ మూవీని ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో అమీజాక్స‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించింది. నిమిషా స‌జ‌య‌న్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది.

ఏఎల్ విజ‌య్ మూవీతోనే రీఎంట్రీ...

మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్‌తోనే ఆరేళ్ల గ్యాప్ త‌ర్వాత అమీజాక్స‌న్ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అమీజాక్స‌న్‌ను మ‌ద‌రాసిప‌ట్ట‌ణం సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌కు ఏఎల్ విజ‌య్ ప‌రిచ‌యం చేశాడు. అత‌డి సినిమాతోనే తిరిగి త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.

విజ‌య్ తేరీలో...

త‌మిళంలో విక్ర‌మ్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన‌ ఐ మూవీతో అమీజాక్స‌న్ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆ త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ తేరీలో ఓ హీరోయిన్‌గా క‌నిపించింది. ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే క‌నిపించింది. రోబో 2 మూవీలో ర‌జ‌నీకాంత్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది.

బిజినెస్‌మెన్‌తో ప్రేమ‌...

జార్జ్ ప‌నాయెట్టు అనేబిజినెస్‌మెన్‌తో ప్రేమ‌లో ప‌డిన అమీజాక్స‌న్ పెళ్లి కాకుండానే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా అత‌డితో బ్రేక‌ప్ చెప్పిన అమీజాక్స‌న్ ఇటీవ‌లే ఎడ్ వెస్ట్‌విక్ అనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

IPL_Entry_Point

టాపిక్