Pushpa 2 trailer Release Time: పుష్ప 2 ట్రైలర్‌పై పెరిగిపోయిన అంచనాలు, పాట్నాలో అడుగుపెట్టిన అల్లు అర్జున్-allu arjun pushpa 2 trailer release today check timings and when and where to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Trailer Release Time: పుష్ప 2 ట్రైలర్‌పై పెరిగిపోయిన అంచనాలు, పాట్నాలో అడుగుపెట్టిన అల్లు అర్జున్

Pushpa 2 trailer Release Time: పుష్ప 2 ట్రైలర్‌పై పెరిగిపోయిన అంచనాలు, పాట్నాలో అడుగుపెట్టిన అల్లు అర్జున్

Galeti Rajendra HT Telugu

Pushpa 2 trailer release: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప2 ట్రైలర్ మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పాట్నాలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ప్రారంభమైంది.

పుష్పలో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ట్రైలర్‌ ఆదివారం రిలీజ్‌కాబోతోంది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరుగుతుండగా.. ఇప్పటికే హీరో అల్లు అర్జున్‌, హీరోయిన్ రష్మిక మంధాన పాట్నాకి చేరుకున్నారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి.

పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో కూడా ఈ ట్రైలర్‌ ఉండనుంది. ట్రైలర్ డేట్‌తో పాటు టైమ్‌ను కూడా ఇప్పటికే చిత్ర యూనిట్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం సరిగ్గా 06.03 నిమిషాలకి ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.

2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్స్‌‌ను కూడా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మేరకు ఫస్ట్ ఈవెంట్ పాట్నాలో జరుగుతోంది.

పుష్ప 2 ట్రైలర్‌ను దర్శకుడు సుకుమార్ 2.44 నిమిషాలకి కట్ చేసినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తల్లో భాగంగా మూడు వెర్షన్లలో ట్రైలర్లని రెడీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల తర్వాత వస్తున్న ఈ పుష్ప మూవీ సీక్వెల్‌ అభిమానుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి.

పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలు పోషించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. అలానే ఫహాద్‌ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.