Pushpa 2 Trailer: నార్త్‌లో పుష్పరాజ్ మేనియా - పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బీహార్‌లో జరపడానికి కారణం ఇదే!
Pushpa 2 Trailer: అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నేడు (ఆదివారం) సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బీహార్‌లోని పాట్నాలో జరుగనుంది. ఈ ఈవెంట్‌కు భారీగా ఫ్యాన్స్ అటెండ్ కానున్నారు. ఫ్యాన్స్ హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Pushpa 2 Trailer: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ట్రైలర్ ఆదివారం (నేడు) రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను బీహార్‌లోని పాట్నాలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్, సుకుమార్‌తో పాటు మూవీ టీమ్ మొత్తం హాజరుకాబోతున్నారు.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కోసం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో అల్లు అర్జున్, సుకుమార్ పాట్నాకు బయలుదేరబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
అభిమానుల క్యూ...
మరోవైపు పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కోసం ఇప్పటికే అభిమానులు క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అల్లు అర్జున్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోన్నారు. రియల్ తుపాకులతో స్వాగతం పలుకుతామని ఓ ఫ్యాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇరవై వేల మంది వరకు ఫ్యాన్స్ ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హజరయ్యే అవకాశం ఉందని చెబుతోన్నారు.
మూడు ట్రైలర్స్...
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కోసం సుకుమార్ మొత్తం మూడు ట్రైలర్స్‌ను కట్ చేసినట్లు సమాచారం. ఇందులో ఒక ట్రైలర్‌ను ఫైనల్ చేసి నేడు అభిమానుల ముందు ప్రదర్శించడంతో పాటు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయబోతున్నారు.
కంప్లీట్‌గా యాక్షన్ అంశాలతో గూస్‌బంప్స్ కలిగించేలా ఈ ట్రైలర్ ఉండబోతుందని అంటున్నారు. ఈ ట్రైలర్‌లో అల్లు అర్జున్ హీరోయిజం పీక్స్‌లో ఉంటుందని చెబుతోన్నారు.
బీహార్‌లో కల్ట్ మూవీ...
పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను పాట్నాలో నిర్వహించడానికి కారణమేమిటన్నది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా తెలుగు ఆడియెన్స్‌తో పాటు నార్త్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా బీహార్‌లో పుష్ప మూవీ కల్ట్ మూవీగా నిలిచింది. బన్నీ మేనరిజమ్స్, యాక్టింగ్‌తో పాటు పాటల్లో స్టెప్పలు బాగా పాపులర్ అయ్యాయి. పుష్పను ఇమిటేట్ చేస్తూ భోజ్‌పురి భాషలో సినిమాలు వచ్చాయి. పుష్పపై వచ్చిన రీల్స్, మీమ్స్‌తో పాటు షార్ట్ ఫిలింస్ బాగా ఫేమస్ అయ్యాయి. పుష్ప హిట్‌తో సీక్వెల్ పై బీహార్‌లో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పాట్నాను ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వేదికగా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
పుష్ప 3 కూడా...
పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.
ఇప్పటికే ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పుష్ప 2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. పుష్ప 2కు కొనసాగింపుగా పుష్ప 3 కూడా రాబోతున్నట్లు సమాచారం.