Bade Miyan Chote Miyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న బడే మియా చోటే మియా.. సలార్ విలన్ మూవీ వీడియో వైరల్-akshay kumar tiger shroff bade miyan chote miyan making video released prithviraj sukumaran as villain ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bade Miyan Chote Miyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న బడే మియా చోటే మియా.. సలార్ విలన్ మూవీ వీడియో వైరల్

Bade Miyan Chote Miyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న బడే మియా చోటే మియా.. సలార్ విలన్ మూవీ వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Feb 10, 2024 12:29 PM IST

Akshay Kumar Tiger Shroff Bade Miyan Chote Miyan: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ మల్టీ స్టారర్‌ సినిమా బడే మియా చోటే మియా. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.

గూస్ బంప్స్ తెప్పిస్తున్న బడే మియా చోటే మియా.. సలార్ విలన్ మూవీ వీడియో వైరల్
గూస్ బంప్స్ తెప్పిస్తున్న బడే మియా చోటే మియా.. సలార్ విలన్ మూవీ వీడియో వైరల్

Bade Miyan Chote Miyan Making Video Viral: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా నటిస్తున్న సినిమా బడే మియా చోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్న పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది.

ఆ మధ్య విడుదలైన బడే మియా చోటే మియా టీజర్ కూడా ఆకట్టుకుంది.తాజాగా ఈ చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తేనే ఉత్కంఠ పెరిగిపోయేలాఉంది. అంత అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సర్రున దూసుకుపోయే ఫ్లైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు, బ్లాస్టింగ్ సీన్స్ ఒక రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.ఈ మేకింగ్ వీడియోలో డైరెక్టర్ అబ్బాస్ మాట్లాడారు.

"యాక్షన్ చిత్రాల పట్ల మీకు అంత ఆసక్తి ఎందుకు అంటే నాదగ్గర సమాధానం లేదు. కానీ, ఈ చిత్రం యాక్షన్ లవర్స్‌కి పండగలా ఉంటుంది. యాక్షన్ ఎక్కువగాఉన్నపటికీప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్‌గా.. రియలిస్టిక్‌గా ఉంటుంది" అని డైరెక్టర్ అలీ అబ్బాస్ వెల్లడించారు. ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ లాంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న బడే మియా చోటే మియా హాలీవుడ్ స్థాయి విజువల్స్‌‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

బడే మియా చోటే మియా సినిమాలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.ప్రభాస్ సలార్‌లో రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీనిర్మిస్తున్న బడే మియా చోటే మియా పాన్ ఇండియా మూవీగా ఒకేసారిహిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీభాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల యాక్షన్ చిత్రాలుఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు ఈ మధ్య వరుసగా ప్లాఫ్స్ వస్తున్నాయి. గతేడాది మూడు సెల్ఫీ, ఓ మై గాడ్ 2, మిషన్ రాణిగంజ్ చిత్రాలు చేశాడు అక్కీ. వాటిలో ఓ మై గాడ్ 2 బాగానే కలెక్షన్స్ వసూలు చేసింది. మిషన్ రాణిగంజ్ యావరేజ్‌గా నిలిచింది. ఇక సెల్ఫీ మూవీ అయితే డిజాస్టర్‌గా రికార్డుకెక్కింది.

2022 సంవత్సరంలో అక్షయ్ కుమార్ ఘోరంగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. రామ్ సేతు, కట్‌పుట్లి, రక్షా బంధన్, సామ్రాట్ పృథ్వీరాజ్, బచ్చన్ పాండే సినిమాలు వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఓటీటీలో నేరుగా విడుదలైన ఆత్రంగి రే మాత్రం మంచి బజ్ క్రియేట్ చేసింది. సూర్యవంశీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అక్షయ్ కుమార్‌కు బడే మియా చోటే మియా హిట్ కావడం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు.

IPL_Entry_Point