Disha-Tiger Breakup: దిశా పటానీ-టైగర్ ష్రాఫ్ బ్రేకప్ అయ్యారా.. ఇంతకీ ఏమైంది?
బాలీవుడ్ హీరో, హీరోయిన్లు దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ విడిపోయినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల తమ ప్రేమ బంధానికి స్వస్తి పలికినట్లు సమాచారం. ఈ విషయంపై ఇద్దరూ నోరు విప్పలేదు.
బాలీవుడ్ నటులు దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ పీకల్లోతూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రిలేషన్షిప్ గురించి బహిరంగంగా వీరిద్దరూ ఓపెన్ అవ్వనప్పటికీ సోషల్ మీడియాలో వీరి ఫొటోలు, సాన్నిహిత్యం చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ విడిపోయారట. ఈ ఏడాది ప్రారంభంలో ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి లేరని, సింగిల్‌గా ఉన్నారని సమాచారం.
టైగర్, దిశా పటానీ విడిపోవడానికి గల కారణంపై స్పష్టత లేదు. ఇద్దరి మధ్య ఏం జరిగింతో తెలియదు. కానీ గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య విభేధాలు తలెత్తాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
హిందుస్థాన్ టైమ్స్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టైగర్ ష్రాఫ్ స్నేహితుల్లో ఒకరు వీరి బ్రేకప్ విషయాన్ని ధ్రువీకరించారు. గత కొన్ని వారల్లోనే ఈ విషయం తనకు తెలిసిందని తెలిపారు. బ్రేకప్ విషయంపై తన స్నేహితులతో కూడా టైగర్ చర్చించలేదని వెల్లడించారు. ప్రస్తుతం తన పనిపైనే దృష్టి కేంద్రీకరించాడని, బ్రేకప్ వల్ల అతడు పెద్దగా ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు. ఇద్దరూ విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమ రాబోయో చిత్రాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రస్తుతం దిశా పటానీ నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క టైగర్ ష్రాఫ్ సోమవారం నాడు తన కొత్త సినిమా గురించి ప్రకటన చేశాడు. స్క్రూ ధీలా అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రెండు సినిమాలకు ఇద్దరు ఒకరికొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ చెప్పుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్