Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్-actress intimate scene anupriya goenka felt uncomfortable doing that scene with 57 year rahul bose ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

Actress Intimate Scene: అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Sep 12, 2024 10:33 PM IST

Actress Intimate Scene: తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన నటుడితో ఇంటిమేట్ సీన్లో నటించడానికి తాను ఇబ్బందిగా ఫీలైనట్లు నటి అనుప్రియ గోయెంకా చెప్పింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతున్న బెర్లిన్ మూవీలో ఆ సీన్ ఉండనుంది.

అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్
అంత వయసున్న నటుడితో అలాంటి సీన్‌లో నటించడానికి ఇబ్బందిగా అనిపించింది: నటి కామెంట్స్ వైరల్

Actress Intimate Scene: అనుప్రియ గోయెంకా.. ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా అభిమానులను సంపాదించుకున్న నటి. సెక్స్ సీన్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. ఇప్పటికే చాలాసార్లు ఎన్నో బోల్డ్ సీన్లలో ఆమె నటించింది. అయితే జీ5 ఓటీటీలోకి రాబోతున్న బెర్లిన్ సినిమాలో తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన రాహుల్ బోస్ తో అలాంటి సీన్లు చేయడానికి తాను కూడా అసౌకర్యంగా ఫీలైనట్లు చెప్పింది.

ఆ సీన్లు ఇబ్బంది పెట్టాయి

ఓటీటీలోకి నేరుగా రాబోతున్న స్పై థ్రిల్లర్ మూవీ బెర్లిన్. ఈ సినిమాలో 37 ఏళ్ల అనుప్రియ గోయెంకా కూడా నటిస్తోంది. అయితే ఇందులోనే 57 ఏళ్ల రాహుల్ బోస్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్యా మూవీలో ఇంటిమేట్ సీన్లు ఉన్నాయి. వీటిని షూట్ చేసే సమయంలో తామిద్దరం ఎలా అసౌకర్యంగా ఫీలయ్యామో ఆమె తాజాగా న్యూస్18 ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తాను రాహుల్ బోస్ కి వీరాభిమానిని అని, చిన్నతనం నుంచే అతన్ని అభిమానిస్తున్నట్లు ఆమె చెప్పింది. అలాంటి నటుడితో తాను ఇంటిమేట్ సీన్లు చేయడం.. అందులోనూ అతడు తనకంటే 20 ఏళ్లు పెద్దవాడు కావడంతో తామిద్దరం కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు తెలిపింది.

ఫొటోలతోనే సిగ్గుపడిపోయాడు

సాధారణంగా సెట్ లో చాలా సరదాగా ఉండే రాహుల్ బోస్.. ఆ సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడని అనుప్రియ గుర్తు చేసుకుంది. "మేము నిజానికి షూటింగ్ చేయడం లేదు. కొన్ని ఫొటోలకు మాత్రమే పోజులిస్తున్నాం. కానీ దానికే అతడు ఎంత సిగ్గుపడిపోయాడో. అతన్ని అలా చూడటం నాకు బాగా అనిపించింది.

ఆ సమయంలో నాలోని ఫ్యాన్ గర్ల్ కాస్తా అతన్ని టీజ్ చేయడం మొదలుపెట్టింది" అని అనుప్రియ చెప్పింది. "ఫొటోలు చాలా బాగా వచ్చాయి. అది అసౌకర్యానికి గురి చేసిన క్షణమే అయినా అవి బాగున్నాయి" అని కూడా ఆమె తెలిపింది. తాను కూడా కాన్ఫిడెంట్ గా కనిపించడానికి ప్రయత్నించినా.. లోలోపల నెర్వస్ గానే ఫీలైనట్లు చెప్పింది.

బెర్లిన్ మూవీ గురించి..

బెర్లిన్ ఓ స్పై థ్రిల్లర్ మూవీ. 1990ల్లోని న్యూఢిల్లీ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కించిన సినిమా ఇది. అతుల్ సబర్వాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, కబీర్ బేడీ కూడా నటించారు. ఈ బెర్లిన్ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చాలా ఆసక్తిగా సాగింది. ఇండియాకు వచ్చిన రష్యా అధ్యక్షుడిని హత్య చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఎలా అడ్డుకున్నారన్నది ఈ మూవీ కథ. ఇష్వాక్ ఇందులో ఓ విదేశీ గూఢాచారిగా నటించగా.. అపర్‌శక్తి ఖురానా ఓ సైన్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ గా నటించాడు.