OTT Spy Thriller Movie: ఓటీటీలోకి నేరుగా రాబోతున్న అదిరిపోయే స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Spy Thriller Movie: ఓటీటీలోకి ఓ స్పై థ్రిల్లర్ మూవీ నేరుగా వస్తోంది. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ సినిమా వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
OTT Spy Thriller Movie: ఓటీటీలే నేరుగా సినిమాలు నిర్మిస్తున్న ఈ కాలంలో మరో స్పై థ్రిల్లర్ మూవీ నేరుగా డిజిటల్ ప్లామ్‌ఫామ్ పైకే వస్తోంది. ఈ మూవీ పేరు బెర్లిన్. ఇది జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీ. కొన్ని రోజుల కిందట ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీ సెప్టెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్పై థ్రిల్లర్ మూవీ బెర్లిన్
స్పై థ్రిల్లర్ మూవీ బెర్లిన్ ట్రైలర్ ను జీ5 ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. "పుష్కిన్, అశోక్, జగదీశ్ అబద్ధాలు, మోసం, భ్రమల వలలో చిక్కుకున్నారు.
ఈ ఇన్వెస్టిగేషన్ అసలు నిజాన్ని వెలికి తీస్తుందా లేక దానిని మరింత సంక్లిష్టం చేస్తుందా? బెర్లిన్ సెప్టెంబర్ 13 నుంచి జీ5లో మాత్రమే" అనే క్యాప్షన్ తో ట్రైలర్ రిలీజ్ చేసింది.
బెర్లిన్ మూవీ ట్రైలర్
బెర్లిన్ ఓ స్పై థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. 1990ల నేపథ్యంలో సాగనున్న సినిమా ఇది. విదేశీ ఇంటెలిజెన్స్ కు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తి నుంచి వాళ్ల ప్రణాళికను రాబట్టడానికి ఓ సైన్ లాంగ్వేజ్ నిపుణుడిని రంగంలోకి దింపడంతో ట్రైలర్ మొదలవుతుంది.
ఇండియాకు రానున్న రష్యా అధ్యక్షుడిని అంతమొందించాలని వాళ్లు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తెలుస్తుంది. ఈ క్రమంలో కొన్ని నమ్మలేని నిజాలు, ట్విస్టులు ఎదురవుతుంటాయి. ట్రైలర్ తోనే సినిమాపై మేకర్స్ ఆసక్తిని పెంచారు.
బెర్లిన్ నేరుగా ఓటీటీలోకే..
జీ5 ఓటీటీలోకి నేరుగా వస్తున్న ఈ బెర్లిన్ సినిమాకు కథ అందించడంతోపాటు అతుల్ సబర్వాల్ డైరెక్ట్ చేశాడు. 2023లో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీని ప్రదర్శించారు. ఈ బెర్లిన్ మూవీలో అపర్‌శక్తి ఖురానా ఓ సైన్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ పుష్కిన్ పాత్రలో నటించాడు.
గతంలో ఈ సినిమా గురించి అతడు మట్లాడాడు. "అదంతా ఓ కొత్త ప్రపంచం. కానీ చాలా అందమైనది. కేవలం కళ్ల ద్వారానే ఎంతో చెప్పాల్సి వచ్చింది. సైన్ లాంగ్వేజ్ కు ఇది చాలా ముఖ్యం" అని అపర్‌శక్తి అన్నాడు.
ఇక మరో బాలీవుడ్ నటుడు ఇశ్వాక్ సింగ్ ఈ సినిమాలో మూగ వ్యక్తి అశోక్ పాత్రలో నటించాడు. అతడు తన పాత్ర గురించి మాట్లాడుతూ.. "మాట్లాడే భాష కంటే మూగ భాష నిర్మాణం పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే ఇదొక సవాలుగా నిలిచింది" అని అన్నాడు. బెర్లిన్ మూవీ ఓ స్పై థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన మూవీ.