Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణా మంగళవారం తెల్లవారుజామును నాలుగు గంటలకు కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుతో ఉదయం నాలుగు గంటలకు కృష్ణ కన్నుమూయడం తెలుగు సినీ రంగాన్ని విషాదంలో నింపింది.1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు.
Super Star Krishna సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ అయిన స్థితిలో కృష్ణను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. కార్డియాక్ అరెస్ట్ అయిన సమయంలో శరీరంలో అవయవాలపై తీవ్రంగా ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. 48గంటల తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏదైనా చెప్పగలమని చెప్పారు.
ఆస్పత్రికి చేరినప్పటి నుంచి కృష్ణా వెంటిలేటర్‌పై ఉన్నారు. శరీరంలో కిడ్నీ,లివర్ ఫెయిల్ కావడంతో కృష్ణాకు డయాలసిస్ కూడా నిర్వహించారు. నానక్‌రాం గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణాకు అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. కార్డియాక్ అరెస్ట్ సమయంలో కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇతర అవయవాలపై పడటంతో మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు చెప్పారు.
ఇటీవల 79 ఏళ్లు పూర్తి చేసుకున్న కృష్ణా నానక్‌రాం గూడలో ఉంటున్నారు. ఆదివారం అర్థరాత్రి గుండెపోటుకు గురయ్యారు. మే 311942లో కృష్ణ జన్మించారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. నటుడు కృష్ణా స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బుర్రిపాలెంలో జన్మించారు. తేనె మనసులు సినిమాతో చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. సాంఘిక, పౌరాణిక,జానపదం ఇలా ఏ సినిమాలో అయినా కృష్ణ ఇట్టే ఒదిగిపోయేవారు.
1970లో పద్మాలయ నిర్మాణ సంస్థను ప్రారంభించిన కృష్ణ, 1983లో హైదరాబాద్‌లో పద్మాలయ స్టూడియోలను ప్రారంభించారు. కృష్ణా నిర్మాతగా 16సినిమాలు రూపొందించారు. దర్శకుడిగా 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఏడాదికి పది చిత్రాలకు పైగా నటించే వారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు.
300 చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్
1964-95మధ్య కృష్ణా 300చిత్రాలలో నటించారు. 1997 ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2003 ఎన్టీఆర్ జాతీయ అవార్డులు, 2000లో ఏయూ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆయన నటించిన చిత్రాల్లో 48 సినిమాల్లో విజయనిర్మలతో కలిసి నటించారు. జయప్రదతో కలిసి 47సినిమాల్లో నటించారు. తెలుగు సినీ రంగంలో ఎన్నో ఆధునిక ఆవిష్కరణలకు కృష్ణా సినిమాలతోనే మొదలయ్యాయి. తన కెరీర్‌లో 340కు పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణకు 2500కు పైగాఅభిమాన సంఘాలు ఉన్నాయి. 2009లో పద్మ భూషణ్ అవార్డు వరించింది. 1989లో ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. కృష్ణా పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియం తరలిస్తారని సన్నిహితులు చెబుతున్నారు.