Superstar Krishna Mahesh Babu Movies: కృష్ణ‌, మ‌హేష్‌బాబు క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా...-superstar krishna death krishna mahesh babu combination movies list ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Superstar Krishna Mahesh Babu Movies: కృష్ణ‌, మ‌హేష్‌బాబు క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా...

Superstar Krishna Mahesh Babu Movies: కృష్ణ‌, మ‌హేష్‌బాబు క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా...

Nelki Naresh Kumar HT Telugu
Nov 15, 2022 08:00 AM IST

Superstar Krishna Mahesh Babu Movies: మ‌హేష్‌బాబును ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి అత‌డిని ఓ మంచి న‌టుడిగా తీర్చిదిద్దారు కృష్ణ‌. తండ్రిగానే కాకుండా న‌ట‌గురువుగా, మార్గ‌ద‌ర్శిగా మ‌హేష్‌బాబు సినీ ప్ర‌యాణంలో కీల‌క భూమిక పోషించాడు. తండ్రీకొడుకుల క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమాలు ఎన్నంటే...

కృష్ణ, మ‌హేష్‌బాబు
కృష్ణ, మ‌హేష్‌బాబు

Superstar Krishna Mahesh Babu Movies: తండ్రిని మించిన గురువు ఉండ‌డ‌ని చాలామంది అంటుంటారు. మ‌హేష్‌బాబు విష‌యంలో ఆ మాట మాత్రం నిజ‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌హేష్‌బాబు అగ్ర‌క‌థానాయ‌కుడిగా ఎద‌గ‌డంతో తండ్రి కృష్ణ పాత్ర ఎక్కువ‌గా ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌హేష్‌బాబు చేత యాక్టింగ్‌లో ఓన‌మాలు దిద్దించారు కృష్ణ‌. మంచి న‌టుడిగా అత‌డిని తీర్చిదిద్దారు.

న‌ట శిక్ష‌కుడిగా, మార్గ‌ద‌ర్శిగా మ‌హేష్‌బాబు వెన్నంటి నిలిచారు కృష్ణ‌. మ‌హేష్‌బాబు కెరీర్ ప్రారంభ‌మైంది కృష్ణ సినిమాల‌తోనే కావ‌డం గ‌మ‌నార్హం. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పోరాటం సినిమాలో కృష్ణ త‌మ్ముడి పాత్ర‌లో తొలిసారి మ‌హేష్‌బాబు బాల‌న‌టుడిగా వెండితెర‌పై అరంగేట్రం చేశాడు. మ‌హేష్ బాబు ఈ పాత్ర‌కు స‌రిపోతాడ‌ని కోడి రామ‌కృష్ణ బ‌ల‌వంత పెట్ట‌డంతో కృష్ణ అంగీక‌రించారు. అలా మ‌హేష్ తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు.

మ‌హేష్‌బాబుకు న‌ట‌న ప‌ట్ల ఇష్టాన్ని గ‌మ‌నించిన కృష్ణ కొడుకు ఆస‌క్తికి అడ్డుచెప్ప‌లేదు. కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం సినిమాల్లో మ‌హేష్‌బాబు కీల‌క పాత్ర‌లు చేశాడు. ముగ్గురు కొడుకులు సినిమాలో కృష్ణ, ర‌మేష్‌బాబు, మ‌హేష్‌బాబు అన్నాద‌మ్ములుగా న‌టించ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో శంఖారావం, గూఢ‌చారి 117, అన్నాత‌మ్ముడు, సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాల‌న్నింటిలో కృష్ణ హీరోగా న‌టిస్తే మ‌హేష్‌బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌ పాత్ర‌లు పోషించాడు. ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన రాజ‌కుమారుడు, వంశీ సినిమాల్లో కృష్ణ కీల‌క పాత్ర‌లు చేశాడు. త‌న మ‌న‌వ‌డు, మ‌హేష్‌బాబు త‌న‌యుడు గౌత‌మ్‌తో సినిమా చేయాల‌ని కృష్ణ క‌ల‌లు క‌న్నారు. కానీ ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూశాడు.

IPL_Entry_Point