Salaar Two Parts: రెండు పార్ట్‌లుగా స‌లార్‌ - క‌న్ఫామ్ చేసిన సీనియ‌ర్ యాక్ట‌ర్-actor devaraj reveals prabhas salaar to release in two parts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Two Parts: రెండు పార్ట్‌లుగా స‌లార్‌ - క‌న్ఫామ్ చేసిన సీనియ‌ర్ యాక్ట‌ర్

Salaar Two Parts: రెండు పార్ట్‌లుగా స‌లార్‌ - క‌న్ఫామ్ చేసిన సీనియ‌ర్ యాక్ట‌ర్

Nelki Naresh Kumar HT Telugu
Apr 17, 2023 09:47 AM IST

Salaar Two Parts: స‌లార్ రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న‌ట్లు సీనియ‌ర్ న‌టుడు దేవ‌రాజ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

స‌లార్
స‌లార్

Salaar Two Parts: ప్ర‌భాస్ (Prabhas) స‌లార్ రెండు పార్ట్‌లుగా రూపొంద‌నున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రెండు పార్ట్‌ల‌పై చిత్ర యూనిట్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. తాజాగా రెండు పార్ట్‌ల‌పై సీనియ‌ర్ యాక్ట‌ర్ దేవ‌రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఓ క‌న్న‌డ‌ ఇంట‌ర్వ్యూలో దేవ‌రాజ్‌ మాట్లాడుతూ స‌లార్ సినిమాలో తాను ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న‌ట్లు పేర్కొన్నాడు.

yearly horoscope entry point

అయితే ఫ‌స్ట్ పార్ట్‌లో త‌న పాత్ర పెద్ద‌గా క‌నిపించ‌ద‌ని, సెకండ్ పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. స‌లార్ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు దేవ‌రాజ్ ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. స‌లార్ ఫ‌స్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ అనే పాత్ర‌లో అత‌డు క‌నిపించ‌బోతున్నాడు. శృతిహాస‌న్ (Shruti Haasan) హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం స‌లార్‌తో పాటు ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్‌తో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్‌

Whats_app_banner