Horror OTT: ఓటీటీలో భయపెడుతున్న హారర్ మిస్టరీ మూవీ.. బొమ్మలకు మనుషుల అవయవాలు.. 10 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
A Classic Horror Story OTT Streaming: హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో వణుకుపుట్టిస్తోంది. ఎన్నడు చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన భయానక మూవీ ఓ క్లాసిక్ హారర్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతూ సోషల్ మీడియాలో ప్రస్తుతం హైలెట్ అవుతోంది. 10 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను ఈ ఓటీటీలో చూసేయండి.!
A Classic Horror Story OTT Release: సినీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే సినిమా జోనర్ ఏది అంటే.. ఎక్కువగా వినిపించే పేరు హారర్. అవును, హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ సన్నివేశాలతో తెరకెక్కిన హారర్ సినమాలు బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ అవుతాయని చాలా మూవీస్ నిరూపించాయి.
ఇద్దరు డైరెక్టర్స్
అందుకే, ఈ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లను మూవీ లవర్స్ నుంచి సినీ ప్రేక్షకుల వరకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసం ఓటీటీ హారర్ మూవీ సజెషన్ కింద తీసుకొచ్చిన సినిమానే “ఏ క్లాసిక్ హారర్ స్టోరీ”. 2021 జూలై 14న డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాకు రాబర్ట్ డె ఫియో, పాలో స్ట్రిప్పోలి ఇద్దరు దర్శకత్వం వహించారు.
నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో వెళ్తుంటారు. దారిలో ఓ చెట్టుకు కారు ఢీ కొని ప్రమాదం జరుగుతుంది. ఆ పక్కనే వారికి ఒక వుడెన్ హౌజ్ కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ కళ్లు, చెవి, నోరు లేని బొమ్మలు దర్శనం ఇస్తాయి. అంతేకాకుండా వాటి ముందు మనుషుల అవయాలు పెట్టి ఉంటాయి.
చనిపోయినవారి కోసం
బొమ్మలకు మనుషుల అవయవాలు పెట్టి ఏదో పూజలు చేస్తుంటారు. కావాల్సిన వారిని బతికి తీసుకురావడానికి చేసే పూజలు అని, అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అక్కడ రాసి ఉండటం గమనిస్తారు. దాంతో అక్కడికి వాళ్లు కాకుండా ఇంకెవరో వచ్చారని, వారికి ఏదో జరిగిందని భయపడతారు. కట్ చేస్తే.. ఆ ఫ్రెండ్స్ నుంచి ఒక్కొక్కరు మిస్ అవుతుంటారు.
ఆ నలుగురని కొందరు ముసుగు వ్యక్తులు అతి కిరాతకంగా వెంటాడి చంపుతుంటారు. ఈ క్రమంలో వారు అడవిలో చిక్కుకోలేదని, అది అడవి కాదనే పెద్ద ట్విస్ట్ తెలిసి అవాక్కైపోతారు. ఇలాంటి ఎన్నో ఊహించని ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వెన్నులో వణుకుపుట్టించే సీన్స్‌తో “ఏ క్లాసిక్ హారర్ స్టోరీ” మూవీని తెరకెక్కించారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఆ వుడెన్ హౌజ్ నుంచి, అడవి నుంచి ఆ నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా, ఆ ముసుగు మనుషులు ఎవరు అనేదే ఏ క్లాసిక్ హారర్ స్టోరీ సినిమా కథ. ఇక హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఏ క్లాసిక్ హారర్ స్టోరీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటాలియన్ మూవీ అయిన ఏ క్లాసిక్ హారర్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్‌లో పది భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది.
ఇటాలియన్‌తోపాటు బ్రెజిలియనన్ పోర్చుగీస్, యూరోపియన్ స్పానిష్, ఫ్రెంచ్, జెర్మన్, పోలిష్, స్పానిష్, టర్కిష్ వంటి పది భాషల్లో ఏ క్లాసిక్ హారర్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, 31 భాషల్లో సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది ఈ సినిమా. అయితే, తెలుగులో లేకపోవడం మాత్రం కాస్తా మైనస్. కానీ, ఇలాంటి జోనర్ సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.