OTT: ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. థియేటర్లలో ఉండగానే.. ఇక్కడ చూసేయండి!-viswam ott release on amazon prime gopichand srinu vaitla comedy action thriller movie viswam digital streaming now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. థియేటర్లలో ఉండగానే.. ఇక్కడ చూసేయండి!

OTT: ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. థియేటర్లలో ఉండగానే.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Nov 01, 2024 08:39 AM IST

Viswam OTT Streaming Now: ఓటీటీలోకి సైలెంట్‌గా తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఆ సినిమా పేరే విశ్వం. గోపీచంద్ హీరోగా డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం మూవీ థియేటర్లలో రన్ అవుతుండగానే ఇవాళ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి విశ్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటని చూస్తే!

ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. థియేటర్లలో ఉండగానే.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. థియేటర్లలో ఉండగానే.. ఇక్కడ చూసేయండి!

Viswam OTT Release: ఓటీటీల్లోకి సడెన్‌గా, చడీచప్పుడు కాకుండా సినిమాలు వస్తున్నాయి. అది కూడా కొన్నిసార్లు థియేటర్లలో ఉండగానే ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి సినిమాల జాబితాల్లోకి టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సినిమా నిలిచింది. గోపీచంద్ లేటేస్ట్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విశ్వం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

యాక్షన్ పరంగా

రామబాణం, భీమా సినిమాల తర్వాత గోపీచంద్ యాక్ట్ చేసిన మూవీ విశ్వం. రామబాణం సినిమా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలవగా భీమా యాక్షన్ పరంగా ఆకట్టుకుంది. కానీ, పెద్ద సక్సెస్ సాధించలేదు. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ నుంచి ఫుల్ లెంత్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మూవీనే విశ్వం.

మంచి హిట్ కోసం

విశ్వం సినిమాకు పాపులర్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఎంతో కాలంగా సరైన హిట్ కోసం డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా ఎదురుచూస్తున్నారు. ఒక మంచి హిట్ కోసం పరితపిస్తున్న గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌‌ బ్యానర్లపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విశ్వం మూవీని నిర్మించారు.

దసరా కానుకగా

అలాగే, విశ్వం చిత్రాన్ని దోనేపూడి చక్రపాణి సమర్పించారు. గోపీచంద్‌కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన విశ్వం దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. అయితే, విశ్వం కథ చాలా రొటీన్‌గా ఉన్న కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. మంచి అంచనాలతో థియేట్రికల్ రిలీజ్ అయిన విశ్వం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

విశ్వం బడ్జెట్-కలెక్షన్స్

నిన్నటి వరకు థియేటర్లలో రన్ అవుతున్న విశ్వం రూ. 17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంటే, రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విశ్వం మూవీ 20 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 17 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. 88 శాతం వరకు కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విశ్వం మూవీకి టాక్ యావరేజ్‌గా ఉన్న కమర్షియల్‌గా హిట్ అందుకోలేకపోయింది.

విశ్వం ఓటీటీ రిలీజ్‌

అలాంటి విశ్వం మూవీ ఇవాళ (నవంబర్ 1) ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. నవంబర్ 1న విశ్వం ఓటీటీ రిలీజ్ ఉంటుందని రూమర్స్ వినిపించినా.. అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. కానీ, సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది విశ్వం చిత్రం. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విశ్వం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే విశ్వం డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఈ లెక్కన థియేట్రికల్ రిలీజ్‌ అనంతరం 20 రోజుల్లోనే విశ్వం ఓటీటీలోకి వచ్చేసిందని తెలుస్తోంది. ఇక విశ్వం మూవికి ఐఎమ్‌డీబీ నుంచి 5.6 రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్, భీమ్స్ సిసిరిలో సంగీతం అందించారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్‌తోపాటు జిషు సేన్‌గుప్తా, వీకే నరేష్, సునీల్ వర్మ, ప్రగతి, వీటి గణేష్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు.

Whats_app_banner