Today OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 12 సినిమాలు.. 9 చాలా స్పెషల్, 5 తెలుగులో స్ట్రీమింగ్.. 3 హారర్ మూవీస్
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చియాన్ విక్రమ్ తంగలాన్‌తోపాటు తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ 2 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, మూడు హారర్ సినిమాలు మరింత ప్రత్యేకంగా ఉన్నాయి.
Today OTT Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో క్రైమ్, యాక్షన్, హారర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ జోనర్స్ అన్నింటికి సంబంధించిన సినిమాలు ఉన్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- అక్టోబర్ 31
మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నోక్టర్నో (ఫిలిప్పీన్ హారర్ సినిమా)- అక్టోబర్ 31
అజ్రేల్ (ఇంగ్లీష్ హారర్ యాక్షన్ చిత్రం)- అక్టోబర్ 31
ది బ్లూ కేవ్ (టర్కిష్ చిత్రం)- అక్టోబర్ 31
అపోకలిప్స్ జడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 31
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- అక్టోబర్ 31
కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- నవంబర్ 1
లవ్ మాక్‌టైల్ 2 (తెలుగు డబ్బింగ్ కన్నడ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 31
అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- అక్టోబర్ 31
అగాథోకాకోలాజికల్ (మలయాళ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- అక్టోబర్ 31
ది వైల్డ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ యాక్షన్ మూవీ)- జియో సినిమా ఓటీటీ- అక్టోబర్ 31
ది సబ్‌స్టాన్స్ (ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ చిత్రం)- ముబి ఓటీటీ- అక్టోబర్ 31
చియాన్ విక్రమ్ మూవీ
ఇవాళ ఒక్కరోజే ఇలా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చాలా స్పెషల్‌గా చెప్పుకునే సినిమా చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న 'తంగలాన్' ఇవాళ ఓటీటీలోకి రానుందని బజ్ క్రియేట్ అయింది. అయితే, ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కావట్లేదు. కానీ, మధ్యాహ్నం, లేదా సాయంత్రం వరకు తంగలాన్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాలు-వెబ్ సిరీసులు
దీని తర్వాత తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2', తెలుగు డబ్బింగ్ కన్నడ లవ్ ఫీల్ మూవీ 'లవ్ మాక్‌టైల్ 2', క్రైమ్ యాక్షన్ తెలుగు డబ్బింగ్ కొరియన్ మూవీ 'ది వైల్డ్', హారర్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ది సబ్‌స్టాన్స్', తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా 'లబ్బర్ పందు', హారర్ చిత్రాలు 'అజ్రేల్', 'నోక్టర్నో', మలయాళ చిత్రం 'అగాథోకాకోలాజికల్' చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
9 స్పెషల్-3 హారర్
ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన వాటిలో 8 సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో కలిపి మొత్తంగా 9 వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, హారర్‌కు సంబంధించినవి ఉండగా.. వీటిన్నింటిలో మూడు హారర్ జోనర్ చిత్రాలు ఉండటం విశేషం. ఇక తెలుగులో నాలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో 5 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.