Modi jibe at Rahul Gandhi: ‘‘భయపడి పారిపోకు.. అమేథీ నుంచి పోటీ చెయ్’’- రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విసుర్లు-pm modi mocks rahul gandhi over rae bareli move says he panicked ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Modi Jibe At Rahul Gandhi: ‘‘భయపడి పారిపోకు.. అమేథీ నుంచి పోటీ చెయ్’’- రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విసుర్లు

Modi jibe at Rahul Gandhi: ‘‘భయపడి పారిపోకు.. అమేథీ నుంచి పోటీ చెయ్’’- రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విసుర్లు

HT Telugu Desk HT Telugu
May 03, 2024 04:39 PM IST

Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అమేథీ నుంచి పోటీ చేయడానికి భయపడి పారిపోయారని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘భయపడి పారిపోవద్దని, అమేథీ నుంచి పోటీ చేయాల’ని ప్రధాని సెటైర్లు వేశారు.

ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ (PTI)

Modi jibe at Rahul Gandhi: రాయ్ బరేలీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బరిలోకి దింపడంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అమేథీలో బీజేపీని ఎదుర్కోవాలని, భయపడి పరుగెత్తొద్దని, పారిపోవద్దని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని ఎద్దేవా చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

మరో సీటు కోసం వెతుకులాట..

2019 లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. కొత్తగా కేరళలోని వాయనాడ్ స్థానాన్ని వెతుక్కున్నారని.. ఇప్పుడు వాయనాడ్ లో కూడా ఓడిపోబోతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో కొత్త నియోజకవర్గం వెతుక్కోక తప్పదని ప్రధాని మోదీ (PM Modi) ఎద్దేవా చేశారు. ‘‘వయనాడ్లో షెహజాదా (రాహుల్ గాంధీ) ఓడిపోవడం ఖాయమని ముందే చెప్పాను. వయనాడ్ (Wayanad) లో పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం వెతుకుతారని కూడా చెప్పాను. ఆయనకు అమేథీ (Amethi) అంటే చాలా భయం, అందుకే రాయ్ బరేలీ (Rae Bareli) వైపు పరుగెత్తుతున్నారు. అందరినీ ఢరో మత్ (భయపడవద్దు) అంటున్నారు. ఈరోజు నేను కూడా రాహుల్ గాంధీని ‘ఢరో మత్.. భాగో మత్ (భయపడవద్దు.. పారిపోవద్దు)’’ అని అడుగుతున్నా’’ అని మోదీ వ్యంగ్య విమర్శలు చేశారు.

సోనియాగాంధీపై విమర్శలు

రాహుల్ గాంధీ తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi) రాయ్ బరేలీ సీటును వదులుకుని రాజ్యసభకు వెళ్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ పెద్ద నాయకురాలు ఎన్నికల్లో పోటీ చేసే సాహసం చేయరని, ఆమె పారిపోతారని నేను ఇప్పటికే పార్లమెంటులో చెప్పాను. ఆమె రాజస్థాన్ కు పారిపోయి, అక్కడి నుంచి రాజ్యసభకు వచ్చారు’’ అని ప్రధాని మోదీ విమర్శించారు. సుదీర్ఘ సస్పెన్స్ తర్వాత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.

2004 నుంచీ..

రాహుల్ గాంధీ 2004లో కుటుంబ కంచుకోట అయిన అమేథీ నుంచి ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004, 2009, 2014లో విజయం సాధించారు. అయితే, 2019లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓడిపోయారు. రాహుల్ గాంధీ తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991లో మరణించే వరకు అమేథీ ఎంపీగా ఉన్నారు. 1999లో సోనియాగాంధీ కూడా ఈ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. అమేథీ, రాయ్ బరేలీలో మే 20న (lok sabha elections 2024) పోలింగ్ జరగనుంది.

Whats_app_banner