CM Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ
CM Revanth Reddy : రైతు రుణమాఫీ, ధాన్యం బోనస్ పై సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే ధాన్యంపై రూ.500 బోసన్ ఇస్తామన్నారు.
CM Revanth Reddy : రైతు రుణాల మాఫీ(Farmer Loan Waiver), ధాన్యం బోనస్ పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి...ఆగస్టు 15 నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా రుణమాఫీ చేయలేక పోయామన్నారు. రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం సేకరణ చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్(Mudiraj) బిడ్డను మంత్రిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని విమర్శించారు. ముదిరాజ్ లను బీసీ-డి నుంచి బీసీ-ఎ గ్రూపులోకి మార్చేందుకు సీనియర్ లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో పోరాడతామన్నారు. మాదిగల వర్గీకరణ చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇస్తామన్నారు.
కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ కుమ్మక్కు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో అరెస్టైన తన బిడ్డ, ఎమ్మెల్సీ కవిత బెయిల్(Kavitha Bail)కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. కవితను లిక్కర్ స్కామ్(Liquor Scam) నుంచి కాపాడేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ ను మోదీ(Modi) కాళ్ల ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారని, అందుకే కొన్ని చోట్లు బీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా చేయట్లేదన్నారు. వంద రోజులకే తనను గద్దె దించాలని కేసీఆర్ అంటున్నారని, పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీని గద్దె దించాలని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడే సీఎం కావాలా?
కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ని కష్టాలు ఎదుర్కోనా పార్టీ జెండాను వదల్లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించింది మరో పార్టీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు, బీసీలకు టికెట్లు కేటాయించి గెలిపించిందన్నారు. రేవంత్ రెడ్డిని ఊడగొట్టాలని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna) అంటున్నారని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు(Palamuru Rangareddy Project) జాతీయ హోదా ఇవ్వాలని డీకే అరుణ ఎప్పుడైనా మోదీని అడిగారా? అని ప్రశ్నించారు. మక్తల్- వికారాబాద్ రైల్వే లైన్ కోసం డిమాండ్ చేశారా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్(KCR) తర్వాత ఆయన కుమారుడు మాత్రమే సీఎం కావాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే దొరలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. దొరలు మాత్రమే సీఎం కుర్చీల్లో కూర్చోవాలా? పేదోడి బిడ్డ కూర్చోవద్దా? అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారని మండిపడ్డారు. గత పదేళ్లలో కేసీఆర్ ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీ కులగణనకు తీర్మానం
రాష్ట్రంలో కాంగ్రెస్(Congress Govt) అధికారంలోకి రాగానే నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు కులగణనకు(BC Caste Census) తీర్మానం చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు(Job Notification) చేపట్టలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ల ఇస్తున్నామన్నారు.
సంబంధిత కథనం