BRS Harish Rao: కేసీఆర్‌ పొలం బాట పట్టగానే సాగర్‌‌లో నీళ్లు వచ్చాయా! అని ప్రశ్నించిన హరీష్‌ రావు-harish rao questioned congres government about water release from nagarjuna sagar ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Harish Rao: కేసీఆర్‌ పొలం బాట పట్టగానే సాగర్‌‌లో నీళ్లు వచ్చాయా! అని ప్రశ్నించిన హరీష్‌ రావు

BRS Harish Rao: కేసీఆర్‌ పొలం బాట పట్టగానే సాగర్‌‌లో నీళ్లు వచ్చాయా! అని ప్రశ్నించిన హరీష్‌ రావు

Sarath chandra.B HT Telugu

BRS Harish Rao: నాగార్జున సాగర్‌లో నీళ్లు లేవని కాంగ్రెస్‌ పార్టీ రైతుల్ని మోసం చేసిందని, కేసీఆర్ పొలం బాట పట్టగానే సాగర్‌ నుంచి నీటిని విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు

BRS Harish Rao: నాగార్జున సాగర్‌లో Nagarjuna Sagar నీరు లేదని చెప్పిన  Congress కాంగ్రెస్‌ నాయకులు, ఇప్పుడు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. రైతుల్ని Farmers Issue కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. telangana తెలంగాణలో  పంటలు Crops ఎండిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ వైఖరే కారణమని ఆరోపించారు.

సకాలంలో నీటిని విడుదల Water Release చేయకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో రైతులకు సంబంధించిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు.

ఎన్నికల్లో గెలవడానికి అన్ని అబద్దపు హామీలిచ్చారని, వంద రోజుల్లో అమలు చేస్తామన్నా హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అమలు చేస్తామన్న హామీలను నెరవేర్చాలన్నారు.

రైతులకు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఎన్నికల కోడ్ ఉందని చెబుతున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వంద రోజులు నిండిన తర్వాతే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్‌ పార్టీ నిలువునా మోసం చేసిందన్నారు. వంద రోజుల్లో ఎన్నికల హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు.

డిసెంబర్‌లోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు. రైతులకు వడ్లు, మక్కలకు రూ.500బోనస్ ఇస్తామన్నారని ఇప్పటి వరకు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.

తక్షణమే యాసంగి పంటలకు బోనస్ ఇవ్వాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.15వేల రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్‌ అధికారంలో ఉండగా రైతులకు రైతు బంధు నిధులు ఎన్నడూ ఆలస్యం కాలేదన్నారు. కౌలు రైతులకు రూ.15వేలు, కూలీలకు రూ.12వేలు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి హామీలను అధికారంలోకి రాగానే గాలికి వదిలేశారన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో కొత్త పథకాల సంగతి అటుంచితే పాత వాటికి కూడా దిక్కులేదన్నారు. మోటర్లు కాలిపోతూ, ట్రాన్స్‌ ఫార్మర్లు పేలిపోతున్నాయన్నారు. ఎండిన పంటలకు రూ.25వేల పరిహారంతో పాటు రూ.500బోనస్‌ తక్షణమే విడుదల చేయాలన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. కేసీర్, బీఆర్‌ఎస్‌ ఎప్పుడు రైతుల పక్షమేనని, రైతుబంధు ఇచ్చింది తామేనని చెప్పారు. రైతుల సంక్షేమం కోసమే పథకాలను ప్రారంభించిన చరిత్ర తమదన్నారు. బిఆర్‌ఎస్‌లో భారత రైతు సమితిగా తాము పనిచేశామన్నారు.

కేసీఆర్‌ పొలంబాట పట్టిన తర్వాతే సాగర్‌ ఎడమ కాల్వకు నీళ్లు విడుదల చేశారన్నారు. కేసీఆర్‌ రైతుల గురించి మాట్లాడితే మంత్రులు ఎదురు దాడి చేయడం అభద్రతా భావంతోనే అన్నారు. తెలంగాణ రైతులు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

తెలంగాణలో వచ్చింది… కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని హరీష్‌ రావు ఆరోపించారు. సాగర్‌లో మొన్నటి వరకు నీళ్లు లేవని చెప్పారని ఇప్పుడు సాగర్‌ ఎడమ కాల్వకు నీరు ఎలా వచ్చిందన్నారు. సిద్ధిపేటలోని గజ్వేల్, దుబ్బాక మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. కేసీఆర్‌ పాలనలో గత నాలుగేళ్లలో ఒక్క ఎకరా కూడా ఎండలేదన్నారు.మల్లన్న సాగర్‌లో నీళ్లున్నా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు.

సంబంధిత కథనం