Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో గందరగోళం, స్టేషన్ ఘన్‌పూర్‌లో వర్గపోరు, కడియం శ్రీహరికి కొత్త టెన్షన్…
Warangal Congress: ఓరుగల్లు కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. కడియం - ఇందిరా వర్గీయుల మధ్య తోపులాటతో ‘స్టేషన్’ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
Warangal Congress: కడియం శ్రీహరి Kadiyam Srihari కాంగ్రెస్Congress లోకి అడుగుపెట్టిన తరువాత ఓరుగల్లు Warangal రాజకీయాల్లో అనూహ్య మార్పులొచ్చాయి. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ ఎంట్రీని కొంతమంది నేతలు వ్యతిరేకించగా.. అధిష్ఠానం చొరవతో ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమణుగుతున్నాయి! ఇక అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయట పడ్డాయి.
ఇదివరకే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ సీనియర్ నేత సింగపురం ఇందిరాSingapuram Indira నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. అధిష్ఠానం చొరవతో వివాదం సద్దుమణిగింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.
అది కాస్త ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడియం, ఇందిరా అనుచరుల తీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా.. విషయం కాస్త అధిష్ఠానం వరకూ వెళ్లింది.
కడియం, ఇందిరా ముందే గొడవ
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని స్టేషన్ ఘన్ పూర్ Station Ghanpur నియోజకవర్గంలో బుధవారం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, పార్టీ నియోజకవర్గ నాయకురాలు సింగపురం ఇందిరా, ఇతర నాయకులు హాజరయ్యారు.
స్టేషన్ ఘన్ పూర్ లోని భ్రమరాంబ ఫంక్షన్ హాలులో మీటింగ్ ఏర్పాటు చేయగా.. నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కడియం శ్రీహరి అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఈ మేరకు మీటింగ్ హాలుకు ముందు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కాగా ఈ చేరికల్లో ప్రధానంగా కడియం శ్రీహరి అనుచరుడు, లింగాల గణపురం జడ్పీటీసీ సభ్యుడు గుడి వంశీధర్ రెడ్డి, ఇంకొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు.
గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరడం ఇష్టం లేని కొందరు ఇందిరా వర్గీయులు ఆయన చేరికను వ్యతిరేకించారు. వంశీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ మీటింగ్ హాల్ వద్ద ఆయన ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కూడా చించేశారు. దీంతో వంశీధర్ రెడ్డితో పాటు ఇంకొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలోనే ఇరువర్గాల నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
మీటింగ్ నుంచి కడియం వాకౌట్
ఓ వైపు స్టేజీ మీద కడియం శ్రీహరి, ఇందిరాతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, ఇతర నాయకులు ఉండగానే ఇరువర్గాల కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు. తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా.. కడియం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయినా కొంతమంది వినకుండా వాగ్వాదం కొనసాగించారు. దీంతో చిన్నగా మొదలైన గొడవ కాస్త కంట్రోల్ తప్పే పరిస్థితికి చేరింది. అనూహ్య పరిణామంతో కంగుతిన్న కడియం శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. చేరికల కారణంగానే వివాదం తలెత్తగా.. కడియం శ్రీహరి, అయన కూతురు కడియం కావ్య ఇద్దరూ చేరికల కార్యక్రమం పూర్తి కాకుండానే అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
ఆ తరువాత అక్కడ చాలాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా.. కడియం శ్రీహరి, కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత అందరూ సైలెంట్ అయి మీటింగ్ ను ముగించారు.
టెన్షన్ లో శ్రీహరి, కావ్య
కడియం కాంగ్రెస్‌లో చేరడానికి ముందే ఇందిరా పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య హస్తం పార్టీలో చేరేందుకు ముందుగానే తన ముఖ్య నేతలతో సమావేశమై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీంతో కడియం శ్రీహరి ఒకింత ఆందోళనకు గురయ్యారు.
చివరకు పార్టీ పెద్దలు కలగజేసుకుని సర్దిచెప్పడంతో స్వయంగా కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ వచ్చి ఇందిరాను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరారు. అందుకు ఆమె కూడా సుముఖం వ్యక్తం చేయగా.. అన్ని వివాదాలు సమసిపోయినట్టేనని కడియం భావించారు. కానీ తాజా గొడవతో పార్టీలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోందని గ్రహించారు.
ఇదే విషయం అధిష్ఠానం వరకూ చేరడంతో కడియం శ్రీహరికి టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ఇందిరా వర్గీయుల్లో అసంతృప్తితో పాటు మరోవైపు ఇంకొందరు నాయకులు కడియంకు సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతోనే కడియం గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. ఇంకో నెల రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. ఆలోగా కాంగ్రెస్ నేతల అసంతృప్తికి కడియం ఏవిధంగా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం