TS Crop Loan Waiver Scheme : ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ - మార్గదర్శకాలపై కసర్తతు, తాజా అప్డేట్ ఇదే
- Telangana Crop Loan Waiver Scheme Updates: రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసే దిశగా కసరత్తు జరుగుతుందని చెప్పారు.
- Telangana Crop Loan Waiver Scheme Updates: రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసే దిశగా కసరత్తు జరుగుతుందని చెప్పారు.
(1 / 5)
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రైతు రుణాన్ని మాఫీ చేస్తామని హామనిచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి రావటంతో… ఈ స్కీమ్ అమలుపై కసరత్తు చేస్తోంది.
(2 / 5)
రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు కోసం ఆర్బీఐ, ఇతర బ్యాంకులతో కలిసి విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
(3 / 5)
నిజానికి రైతురుణమాఫీపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. ఏకకాలంలోనే 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ లోనూ రుణమాఫీని ప్రస్తావించారు.
(4 / 5)
ఇక రైతుబంధు నిధుల జమపై కూడా మంత్రి తుమ్మల ప్రకటన చేశారు. 2023-24 యాసంగి సీజన్ కోసం మార్చి 29వ తేదీ వరకు 64,75,819 (92.68) శాతం మందికి రైతుబంధు నిధులను విడుదల చేశామని తెలిపారు.
ఇతర గ్యాలరీలు