TS BJP Second List : బీజేపీ రెండో జాబితా విడుదల- తెలంగాణ నుంచి ఆరుగురికి ఛాన్స్-hyderabad news in telugu bjp second list telangana six lok sabha candidates final ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Bjp Second List : బీజేపీ రెండో జాబితా విడుదల- తెలంగాణ నుంచి ఆరుగురికి ఛాన్స్

TS BJP Second List : బీజేపీ రెండో జాబితా విడుదల- తెలంగాణ నుంచి ఆరుగురికి ఛాన్స్

Bandaru Satyaprasad HT Telugu
Mar 13, 2024 09:27 PM IST

TS BJP Second List : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో తెలంగాణ నుంచి 6గురికి చోటు దక్కింది. మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి రఘునందర్ రావు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది.

బీజేపీ రెండో జాబితా
బీజేపీ రెండో జాబితా

TS BJP Second List : లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పోటీ చేసి అభ్యర్థుల రెండో జాబితాను(BJP Second List) బీజేపీ ప్రకటించింది. మొత్తం 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ(TS BJP) నుంచి ఆరుగురికి సీట్లు కేటాయించింది.

లోక్ సభ అభ్యర్థులు

  • ఆదిలాబాద్-గోడం నగేశ్
  • పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్
  • మెదక్-రఘునందన్ రావు
  • మహబూబ్ నగర్-డీకే అరుణ(DK Aruna)
  • నల్గొండ-సైదిరెడ్డి
  • మహబూబాబాద్-సీతారాం నాయక్

బీజేపీ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 6 స్థానాలతో కలిపి ఇప్పటి వరకూ 15 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం, వరంగల్ లోక్ సభ స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

నల్గొండ(Nalgonda Parliament) పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఖరారు చేసింది బీజేపీ. 2019 హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిపై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సైదిరెడ్డి తన అనుచరులతో మాట్లాడిన ఓ ఆడియో వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. బీఆర్ఎస్ లో ఆర్థికంగా బలంగా ఉన్నవారే పోటీకి దూరంగా ఉంటున్నారన్నారు.

తొలి జాబితాలో అభ్యర్థులు

  • కరీంనగర్ - బండి సంజయ్(Bandi Sanjay)
  • నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్
  • జహీరాబాద్ -బీబీ పాటిల్
  • మల్కాజ్ గిరి - ఈటల రాజేందర్
  • సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి(Kishan Reddy)
  • హైదరాబాద్ -డా. మాధవీ లత
  • చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • నాగర్ కర్నూల్ - పి.భరత్
  • భువనగిరి -బూర నర్సయ్య గౌడ్

ఇటీవల 195 మందితో బీజేపీ తొలి జాబితాను(BJP First List) ప్రకటించింది. తాజాగా 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. దీంటో ఇప్పటి వరకూ 267 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. రెండో జాబితాలో తెలంగాణ నుంచి 6, గుజరాత్ 7, దాద్రానగర్‌ హవేలీ 1, దిల్లీ 2, హరియాణా 6, హిమాచల్‌ప్రదేశ్‌ 2, కర్ణాటక 20, మధ్యప్రదేశ్‌ 5, మహారాష్ట్ర 20, త్రిపుర 1, ఉత్తరాఖండ్‌ 2 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

రెండు స్థానాలకు బీఆర్ఎస్(BRS) అభ్యర్థుల ప్రకటన

చేవెళ్ల, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ప్రకటించారు. అదే విధంగా వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు. అలాగే జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. గతంలో నిజామాబాద్ స్థానం నుంచి కవిత ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కవితకు(Kalvakuntla Kavaitha) సీటు కేటాయించలేదు కేసీఆర్. అయితే ఆమెను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ టికెట్ ను వేరొకరికి కేటాయించడంతో...కవిత పోటీపై ఆసక్తి నెలకొంది.

సంబంధిత కథనం