BRS MP Candidates: తెలంగాణలో 17 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు.. ఎంపికలు పూర్తి చేసిన కేసీఆర్..-finalization of brs candidates for 17 seats in telangana kcr has completed selections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Mp Candidates: తెలంగాణలో 17 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు.. ఎంపికలు పూర్తి చేసిన కేసీఆర్..

BRS MP Candidates: తెలంగాణలో 17 స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు.. ఎంపికలు పూర్తి చేసిన కేసీఆర్..

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:10 AM IST

BRS MP Candidates: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. 17స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కేసీఆర్ పూర్తి చేశారు.

బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్
బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కేసీఆర్

BRS MP Candidates: పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ BRS తరపున పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ KCR అభ్యర్థుల ఎంపికను… సామాజిక సమతూకం పాటిస్తూ పూర్తి చేశారు.

ప్రజా బలం వున్న నేతలను Candidates ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా Electionsలో విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించినట్టు బిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంతోనే పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నెలకొందని చెబుతున్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తుకుచేసుకుంటున్నారని బిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంటు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైందని, కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకెళుతున్నారు.

ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజక వర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం బిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజల్లోంచి అనూహ్య మద్దతు లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో విస్తృత ప్రచారాన్ని చేపట్టి ప్రజల ఆదరణను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టేలా రూట్‌ మ్యాప్ సిద్ధం చేశారు. మరోవైపు తెలంగాణలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే బరిలోకి దిగనుంది.

మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే…

1)ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు(ఓసీ)

2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత

3) కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)

4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్

5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)

6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)

7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య

8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)

9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)

10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)

11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)

12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)

13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .

14) సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)

15) భువనగిరి - క్యామ మల్లేశ్ (బీసీ)

16) నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)

17) హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

సంబంధిత కథనం