Allu Arjun Supports Ysrcp Candidate : వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు, నంద్యాలలో ప్రచారం!-nandyal icon star allu arjun supports ysrcp candidate shilpa ravi chandra reddy ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Allu Arjun Supports Ysrcp Candidate : వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు, నంద్యాలలో ప్రచారం!

Allu Arjun Supports Ysrcp Candidate : వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు, నంద్యాలలో ప్రచారం!

Bandaru Satyaprasad HT Telugu
May 11, 2024 02:09 PM IST

Allu Arjun Supports Ysrcp Candidate : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు. నంద్యాలలోని శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ దంపతులు వెళ్లారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానాలు అక్కడికి చేరుకున్నారు.

నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు

Allu Arjun Supports Ysrcp Candidate : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డికి సన్నిహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో ఆకస్మిక పర్యటన చేశారు. అల్లు అర్జున్ రాకతో నంద్యాల పట్టణం కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. వేలాది మంది మద్దతుదారుల మధ్య అల్లు అర్జున, తన భార్య స్నేహారెడ్డితో కలిసి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకుని పుష్ప పుష్ప అంటూ నినాదాలు చేశారు. శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతివ్వడం ఇదే తొలిసారి కాదు... 2019లో కూడా శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతిచ్చి ప్రచారం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డికి మద్దతుగా నంద్యాలలోని ఆయన నివాసానికి వచ్చారు. శిల్పా రవిరెడ్డి తరఫున ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

శిల్పా రవి విజయం సాధించాలని కోరుకుంటున్నా -అల్లు అర్జున్

అల్లు అర్జున్ నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ తెలిపారు. రవి చంద్ర రాజకీయాల్లోకి రాకముందు ప్రతీ వారం కలిసేవాళ్లమన్నారు. కానీ ఇద్దరు బిజీ అయిపోవడంతో ఆరు నెలలకొకసారి కలుస్తామన్నారు. ప్రజాసేవ చేస్తున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చానన్నారు. శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆయన ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ కు మద్దతు

అయితే బన్నీ ఇటీవల జననేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పోస్ట్ పెట్టారు. పవన్ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానన్నారు. ఒక కుటుంబ సభ్యునిగా తన ప్రేమ, మద్దతు ఎప్పటికీ పవన్ కే ఉంటుందనన్నారు. పవన్ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ ఈ పోస్టులో రాశారు.

టాలీవుడ్ హీరోలు, ఆర్టిస్టుల ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నాయి. జనసేన, టీడీపీకి మద్దతుగా టాలీవుడ్ హీరోలు, ఆర్టిస్టులు, జబర్దస్త్ కమెడియన్లు ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి సైతం కొందరు టాలీవుడ్ ఆర్టిస్టులు, యాంకర్లు మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ మద్దతుగా నాగేంద్ర బాబు సతీమణి, ఆయన కుమారుడు వరుణ్ తేజ్, హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రాచారం చేశారు. జబర్దస్త్ కమెడియన్లు మొత్తం పిఠాపురం వీధుల్లో ప్రచారం చేస్తూ పవన్ కల్యాణ్ విజయం కోసం కష్టపడుతున్నారు.

పిఠాపురంలో రామ్ చరణ్

మెగా హీరో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా పిఠాపురం వెళ్లారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా రాంచరణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని రామ్ చరణ్ సందర్శించనున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మెగా హీరో పిఠాపురం వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం