Jagan On Muslims: ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నానని ప్రకటించిన జగన్
Jagan On Muslims: ఏపీలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని, అలా ప్రకటించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటోన్న బీజేపీతో ఎందుకు కలిసి ఉంటున్నారని ప్రశ్నించారు.
Jagan On Muslims: ఏపీలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని కర్నూలు వైఎస్సార్ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో పర్యటించిన జగన్ ముస్లిం రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ముస్లిం మైనార్టీలకు సామాజిక పరిస్థితిని ఆధారంగా కల్పిస్తోన్న మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో చంద్రబాబు ఎలా కలిసి ఉన్నాడో చెప్పాలన్నారు. ఓట్ల కోసం మైనార్టీలకు మభ్యపెట్టే మాటలు చెబుతాడని, మైనార్టీ రిజర్వేషన్లు వ్యతిరేకించే బీజేపీతో కలిసి ఉంటోన్న చంద్రబాబుకు మించిన ఊసరవెల్లి రాజకీయాలు ఎవరు చేయరన్నారు. ఆరునూరైనా మైనార్టీ రిజర్వేషన్లను కొనసాగిస్తామని స్పస్టం చేశారు.
ఏపీలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని కర్నూలు వైఎస్సార్ సర్కిల్‌లో ప్రకటించారు. అన్ని మతాల్లోను బీసీలు, ఓసీలు ఉంటారని, మైనార్టీలను వేరుగా చూడటం, మైనార్టీలకు నోటి వరకు వచ్చిన కూడు తీసేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
రాజకీయ స్వార్థంతో మైనార్టీల జీవితాలతో పార్టీలు ఆడుకుంటున్నారని ఆరోపించారు. నాలుగు శాతం రిజర్వేషన్లు, ఎన్నార్సీ, సిఏఏ వంటి విషయాల్లో మైనార్టీలకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. మైనార్టీల మీద ప్రేమతో డిబిటి, ఇళ్ల పట్టాలతో పాటు ఉర్దూను అధికార భాషగా చేయడంతో పాటు నలుగురు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంతో పాటు మైనార్టీని డిప్యూటీ సిఎం చేసి తన పక్కనే పెట్టుకున్నానన్నారు.
ఏపీలో నాలుగు శాతం మైనార్టీ రిజర్వేషన్లను రాజకీయాల్లో కూడా అమలు చేస్తున్నామని జగన్ ప్రకటించారు. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ విషయంలో మైనార్టీలకు వైపే వైసీపీ ఉంటుందని జగన్ కర్నూలులో ప్రకటించారు.
58నెలల కాలంలోనే వైసీపీ మైనార్టీలకు సముచితం స్థానం కల్పించినట్టు చెప్పారు. మైనార్టీ సోదరులు ఈ విషయంలో గమనించాలన్నారు. 175 ఎమ్మెల్యే సీట్లలో నాలుగు శాతం 7 ఎమ్మెల్యే సీట్లను మైనార్టీలకు కేటాయించామన్నారు. ఈ విధంగా పొలిటికల్ రిజర్వేషన్ కూడా తాము కల్పించినట్టు చెప్పారు. చంద్రబాబు మైనార్టీకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలెత్తిన రాదన్నారు.
నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీలు అంటూ వారిపట్ల ప్రేమ, అభిమానాలను చూపించేది అందుకేనన్నారు. ముఖ్యమంత్రని స్థాయిలో వారిపై ప్రేమ చూపిస్తే వెనుకబడిన వర్గాలకు గ్రామాల్లో వారికి ఇచ్చే గౌరవం పెరిగి ఆత్మస్థైర్యం పెరుగుతుందని చెప్పారు. ప్రతి సందర్భంలో నా నా అనేది అందుకేనన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసాలు మాత్రమే చేస్తాడన్నారు. 2014లో ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు ప్రతి ఇంటికి మ్యానిఫెస్టో పంపించాడని,అప్పట్లో చెప్పిన అంశాలను 2019 వరకు ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రాజధాని నిర్మాణం వరకు ఏది అమలు చేయలేదన్నారు. చంద్రబాబును నమ్మి ఓటర్లు మోసపోవద్దన్నారు.
సంబంధిత కథనం