TS Minority Financial Assistance : ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం, ఆగస్టు 19న చెక్కుల పంపిణీ-telangana govt one lakh financial assistance to muslim minorities distribution on august 19th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Minority Financial Assistance : ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం, ఆగస్టు 19న చెక్కుల పంపిణీ

TS Minority Financial Assistance : ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం, ఆగస్టు 19న చెక్కుల పంపిణీ

Bandaru Satyaprasad HT Telugu
Aug 13, 2023 10:30 PM IST

TS Minority Financial Assistance : ముస్లిం మైనార్టీలకు అందించే రూ.లక్ష ఆర్థికసాయం చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని హోంమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 16న కాకుండా ఆగస్టు 19న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముస్లిం మైనార్టీలకు ఆర్థిక సాయం
ముస్లిం మైనార్టీలకు ఆర్థిక సాయం

TS Minority Financial Assistance : తెలంగాణ సర్కార్ అర్హులైన ముస్లిం మైనార్టీలకు వంద సబ్సిడీ పథకం కింద లక్ష రూపాయలను అందజేయనుందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కానీ బ్యాంకులకు సెలవులు ఉండడంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రూ.లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 16న కాకుండా ఆగస్టు 19న నిర్వహించనున్నామని తెలియజేశారు. హైదరాబాద్ పరిధిలోని మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 3,600 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా జిల్లాల్లో మొదటి దశలో ఎంపికైన దాదాపు పది వేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేస్తారని అన్నారు.

ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు

రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చెక్కుల పంపిణీ జరగనుందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హోంమంత్రి మాట్లాడుతూ ..తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. తెలంగాణలోని మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింల సంక్షేమం కోసం ఎంతో కృషి జరుగుతుందన్నారు. 100% సబ్సిడీతో ఈ పథకం కింద లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్ నివాసి, మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి మహ్మద్ అస్రార్ ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థాయిలో ఏఎంఈలో 158వ ర్యాంక్‌ను పొందారని, కానీ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో పైలట్‌ కోర్సులో ప్రవేశించడం అసాధ్యమైందన్నారు. తన వినతి మేరకు సీఎం కేసీఆర్‌ మహమ్మద్ అస్రార్ పైలట్ కావడానికి 35 లక్షల రూపాయలను విడుదల చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

ముస్లిం పారిశ్రామికవేత్తల కోసం సబ్సిడీ పథకం

సాల్వి ఫాతిమా పైలట్‌ విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల రూపాయల సాయం చేసిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింల అభివృద్ధికి పాటు పడలేదని హోంమంత్రి దుయ్యబట్టారు. 48 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన కన్నా తొమ్మిదన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలన మిన్న అన్నారు . ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం నాలుగు రెట్లు ఎక్కువ నిధులు వెచ్చించిందని, త్వరలో ముస్లింల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తామని హోంమంత్రి వివరించారు.

Whats_app_banner