AP Exit Polls : ఏపీలో కూటమిదే విజయం, పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ - ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
AP Exit Polls : ఏపీలో కూటమిదే అధికారమని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 98-120 సీట్లు, వైసీపీకి 55-77 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
AP Exit Polls : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయవకాశాలపై ప్రముఖ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఎన్డీఏ కూటమికి 98-120 సీట్లు, వైసీపీకి 55-77 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ అవుతారని ఇండియా టుడే స్పష్టం చేసింది.
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
- టీడీపీ : 78-99 స్థానాలు
- వైసీపీ : 55-77 స్థానాలు
- జనసేన : 16-18 స్థానాలు
- బీజేపీ : 4-6 స్థానాలు
- కాంగ్రెస్ : 0-2 స్థానాలు
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని పలు సర్వేలు వెల్లడించాయి. తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో కూటమిదే అధికారమని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరుస్తుందని 0-2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండియా టుడే తెలిపింది. ఇక పార్టీల పరంగా ఓట్ షేర్ లో టీడీపీకి 42శాతం, వైసీపీకి 44 శాతం, జనసేనకు 7శాతం, బీజేపీకి 2శాతం, కాంగ్రెస్ కు 2 శాతం, ఇతరులు 3 శాతం ఓటింగ్ శాతం వస్తాయని అంచనా వేసింది. అలాగే లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ 13-15 స్థానాలు, జనసేన 2, బీజేపీ 4-6 ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, వైసీపీ 2-4 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ఇతర ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ : 45-60 సీట్లు
- టీడీపీ : 95 -110 సీట్లు
- జనసేన : 14-20 సీట్లు
- బీజేపీ : 2-5 సీట్లు
పీపుల్స్ పల్స్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ - 3-5 సీట్లు
- టీడీపీ - 13-15 సీట్లు
- జనసేన -2 సీట్లు
- బీజేపీ -2-4 సీట్లు
చాణక్య అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ : 39-49 సీట్లు
- కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) -114-125 సీట్లు
పోల్ స్ట్రాటజీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ : 115 -125 సీట్లు
- కూటమి : 50-60 సీట్లు
పోల్ స్ట్రాటజీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ : 16-18 సీట్లు
- కూటమి : 7-9 సీట్లు
ఆరా మస్తాన్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ : 94-104 సీట్లు
- ఎన్డీఏ : 71-81 సీట్లు
- ఇతరులు : 0
ఆరా మస్తాన్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
- వైసీపీ : 13-15 సీట్లు
- ఎన్డీఏ : 10-12 సీట్లు
సంబంధిత కథనం