TDP Janasena First List : టీడీపీ, జనసేన తొలి జాబితా రెడీ- నేడు చంద్రబాబు, పవన్ ప్రకటన
TDP Janasena First List : టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయ్యింది. ఇవాళ ఉదయం 11 చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ జాబితాను ప్రకటించనున్నారు.
TDP Janasena First List : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల పేరుతో అభ్యర్థులను ఖరారు చేస్తుంది. టీడీపీ, జనసేన(TDP Janasena First List) కూడా అభ్యర్థుల ఖరారుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటించనున్నారు. కాసేపట్లో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)వెళ్లనున్నారు. చంద్రబాబు, పవన్ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నారు.
పార్టీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ
తెలుగుదేశం, జనసేన(TDP Janasena) ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు... టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ తో సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన తరుణంలో ఈ భేటీపై ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి జాబితాలో ఏ నియోజకవర్గాలు, ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా(First list)ను ప్రకటించనున్నారు.
తొలి జాబితాలో వందకు పైగా స్థానాలు
తొలిజాబితాలో వందకు పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో కొందరి పేర్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కుప్పం నుంచి టీడీపీ నేత చంద్రబాబు, భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయనున్నారని సమాచారం. టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేశ్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ బరిలో ఉండే అవకాశం కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను శనివారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారు. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదలకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇరు పార్టీల నేతల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 11.40 నుంచి 11.47 గంటల మధ్య మంచి ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. తొలిజాబితాలో వంద మందికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం