Sajjala Bhargava Reddy : పింఛన్ల పంపిణీ దుష్ప్రచారంపై టీడీపీ ఫిర్యాదు, సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం-amaravati ec orders cid inquiry on sajjala bhargava reddy on pension distribution ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Sajjala Bhargava Reddy : పింఛన్ల పంపిణీ దుష్ప్రచారంపై టీడీపీ ఫిర్యాదు, సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

Sajjala Bhargava Reddy : పింఛన్ల పంపిణీ దుష్ప్రచారంపై టీడీపీ ఫిర్యాదు, సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2024 08:04 PM IST

Sajjala Bhargava Reddy : ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని సజ్జల భార్గవరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ...ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది.

సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

Sajjala Bhargava Reddy : ఏపీలో అధికార వైసీపీ(Ysrcp), ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఫిర్యాదులతో ఈసీ(EC)కి వద్ద పార్టీలు క్యూకడుతున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదు చేయగా ఈసీ సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో సీఐడీ చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే... వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ(TDP) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ(AP CID) విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఇంటింటికీ పింఛన్లు(Pensions) అందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కారణమని వైసీపీ సోషల్ మీడియా(Social Media)లో ప్రచారం చేస్తుందని, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి(Sajjala Bhargava Reddy) ఆధ్వర్యంలో ఈ దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ(TDP) ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లు, పింఛనుదారులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొంది. విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని భార్గవరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ(CID) డీజీకి ఈసీ ఆదేశించింది.

చంద్రబాబు, లోకేశ్ పై సీఐడీ కేసు నమోదు

ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) పై అపోహలు కల్పించేలా టీడీపీ వీడియోలు, ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తుందని నిన్న వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణకు ఈసీ ఆదేశాలతో సీఐడీ ఇవాళ కేసు నమోదు చేసింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిందెవరో తేల్చేలా దర్యాప్తు చేపట్టింది. IVRS కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై సీఐడీ(CID) ఫోకస్ పెట్టింది. దీనిపై పూర్తి విచారణ తర్వాత సీఐడీ ఈసీకి నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ U/S 171(F)(G), 188, 505(2), R/w 120(B) సెక్షల కింద సీఐడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు(Chandrababu), ఏ2 గా లోకేశ్(Lokesh) పేర్లను చేర్చారు. అలాగే టీడీపీ(TDP), టీడీపీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్, ఐవీఆర్ కాల్స్(IVRS) , వాయిస్ టెక్నీషియన్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

వైసీపీ ఈసీకి ఫిర్యాదు

ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) ప్రధాన ఆస్త్రంగా మారిన సంగతి తెలిసిందే. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ చట్టంపై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్(IVRS Calls) కూడా చేస్తుంది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే వైసీపీ(Ysrcp) ఆరోపిస్తుంది. సీఎం జగన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. దీంతో వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ(EC) సీఐడీని ఆదేశించింది. టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సీఐడీ(సైబర్ సెల్)(CID)ను ఈసీ ఆదేశించింది. విచారణ జరిపి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

సంబంధిత కథనం